తెలంగాణ వార్తలు

వ్యవసాయ భూములకు ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా… రేవంత్ రెడ్డి

రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్లు, పరిశ్రమలకు ఇచ్చిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు కలిగిన భూములకు రైతు భరోసా ఇవ్వబోమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.రైతులకు ఎట్టి పరిస్థిల్లో అన్యాయం జరగనివ్వమని తెలిపారు .. ఈరోజు సచివాలయంలో సీఎం అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. సచివాలయంలో మూడు గంటల పాటు ఈ కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం నిర్వహించిన పత్రికా సమావేశంలో రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్పష్టంగా చెబుతున్నామని, వ్యవసాయ యోగ్యత లేని భూములకు మాత్రం రైతు భరోసా వర్తించదన్నారు. వ్యవసాయ భూములకు మాత్రం ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా ఇవ్వనున్నట్లు చెప్పారు.

భూమి లేకుంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా

రైతు భరోసా కింద సంవత్సరానికి ఎకరాకు రూ.12 వేలు ఇస్తామన్నారు. వ్యవసాయ యోగ్యం కలిగిన భూములన్నింటికి రైతు భరోసా కింద నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేల సాయం అందిస్తామన్నారు. భూమిలేని రైతు కుటుంబాలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద రూ.12 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. గతంలో పరిశ్రమలకు భూములు ఇచ్చి ధరణి లోపాల కారణంగా రైతుబంధు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని… కానీ వారే ముందుకు వచ్చి వివరాలు చెప్పాలన్నారు.

కొన్నేళ్లుగా రేషన్ కార్డు సమస్యగా మారిందన్నారు. రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కేబినెట్ సమావేశం ప్రధానంగా మూడు అంశాలపై చర్చించిందని… వాటికి సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మూడు అంశాలను ప్రజలకు చేరవేయాలన్నారు. జనవరి 26 నుంచి అన్ని పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

కొత్త సంవత్సరంలో ఇదే మొదటి మీడియా సమావేశం

2025 కొత్త సంవత్సరంలో ఇదే మొదటి పత్రికా సమావేశమని రేవంత్ రెడ్డి తన మీడియా సమావేశం ఆరంభంలో అన్నారు. అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. రైతులకు కొత్త ఏడాదిలో మంచి జరగాలని కోరుకుంటున్నామని, వారిని ఆదుకోవాలని నిర్ణయించామన్నారు. వ్యవసాయం దండగ కాదని… పండుగ చేయాలని తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

సన్న బియ్యం పంపిణీ కొత్త మండల ఏర్పాటుపై క్యాబినెట్ లో చర్చ జరిగింది ..సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా.. కేబినెట్ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అజెండాలో 22 అంశాలు ఉన్నాయి. అందులో..

రైతు భరోసాకి ఆమోదముద్ర
ఇందిరమ్మ ఇళ్లు
బీసీ రిజర్వేషన్లు
నూతన మండలాల ఏర్పాటు
రేషన్ కార్డుల జారీ
సన్న బియ్యం – ఎప్పటి నుంచి ఇవ్వాలి

అంతేకాకుండా.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి CM రేవంత్ రెడ్డి మామ మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సింగూరు ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, దివంగత మంత్రి రాజనర్సింహ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజీ 2 వ్యయం 1784 కోట్లకు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.పాలమూరు- రంగారెడ్డి లో భాగంగా ఎదుల–డిండికి 1800 కోట్ల అంచనా వ్యయానికి క్యాబినెట్​ ఆమోదం తెలిపింది.

మరోవైపు.. పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్‌లో 588 కారుణ్య నియామకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Related posts

తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల వేతనాలు కట్ చేసి వారి ఖాతాలో వేస్తాం ..సీఎం

Ram Narayana

ఎమ్మెల్సీ చుట్టూ బిగుస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు!

Ram Narayana

కాళేశ్వరం కేసులో సీబీఐ ముందడుగు.. రంగంలోకి దర్యాప్తు బృందాలు!

Ram Narayana