రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసు శాఖ చర్యలు : పోలీస్ కమిషనర్
వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా గమ్యస్ధానాలకు చేరుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గురువారం ఓక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల కట్టడికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలలో భాగంగా వేగాన్ని నియంత్రించేందుకు150 సోలార్ బ్లీంకింగ్ బారికేడ్స్, అదేవిధంగా పోలీస్ శాఖలో ఎవిడెన్స్ ఆధారిత పోలీసింగ్ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ కు కొత్తగా రెండు కంప్యూటర్ ట్యాబ్‌లను అందజేశారు. 10 డిజిటల్ కెమెరాలు, 27 బ్రీత్ ఎనలైజర్, 60 కంప్యూటర్ ట్యాబ్‌లు, 02 స్పీడ్ లేజర్ గన్స్, ఇతర పరికరాల తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్లో అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపారు.
ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి వేగ నియంత్రణకు సోలార్ బ్లింకింగ్ బారికేడ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు నిరంతరం డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాని పోలీస్ అధికారులకు ఆదేశించిట్లు తెలిపారు. తప్పు చేసిన వారు చట్టం నుండి తప్పించుకోకుండా పోలీస్ శాఖలో ఎవిడెన్స్ ఆధారిత పోలీసింగ్ లో భాగంగా కేసుల విచారణ, డయల్ 100 కాల్స్ స్పందనతో పాటు వీడియో, ఫోటోగ్రాఫీ ఎవిడెన్స్ వచ్చే విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ కు కొత్తగా రెండు కంప్యూటర్ ట్యాబ్ లు అంజేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా వేసేందుకు డిజిటల్ కెమెరాలు ఉపయోగించాలని పోలీస్ అధికారులు సూచించారు. రహదారులపై వేగంగా దూసుకెళ్తున వాహనాలను కట్టడి చేసేందుకు స్పీడ్ లేజర్ గన్స్ ను ఖమ్మం రూరల్ , వైరా డివిజన్ ప్రాంతాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు, ఇతర వాహనచోదకులు సీటు బెల్టు ధరించాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపవద్దన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ..అసాంఘిక కార్యాకాలపాలు, నేరాల నియంత్రణ, సైబర్ నేరాలు, గంజాయి వంటి మత్తు పదార్థాల కట్టడికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.