- ఇప్పటికే పోసానిపై ఏపీలో పదుల సంఖ్యలో కేసులు
- ఓబులవారిపల్లె పీఎస్ లో నమోదైన కేసులో ఇటీవలే అరెస్ట్
- టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై తాజాగా పుత్తూరులో కేసు నమోదు
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీలో మరో కేసు నమోదైంది. ఈసారి చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.
పోసానిపై ఏపీలో ఇప్పటికే 11 వరకు కేసులు ఉన్నాయి. ఓబులవారిపల్లె పీఎస్ లో నమోదైన కేసులో రాయచోటి పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. ఈ విచారణ కొనసాగుతుండగానే, పీటీ వారెంట్ పై నరసరావుపేట పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకుని నేడు కోర్టులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కోర్టు పోసానికి 10 రోజుల రిమాండ్ విధించింది. దాంతో అతడిని గుంటూరు జైలుకు తరలించారు.
ఈ క్రమంలో పుత్తూరులో కొత్త కేసు నమోదైంది. అటు, పోసానిని అరెస్ట్ చేసేందుకు ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు సిద్ధంగా ఉన్నారు.