Nims fire accident
క్రైమ్ వార్తలు

హైదరాబాద్ నిమ్స్ లో అగ్ని ప్రమాదం

  • మంటలను అదుపు చేసిన అగ్ని మాపక సిబ్బంది
  • ప్రాణ నష్టం జరగలేదని మంత్రి రాజనర్సింహ వెల్లడి

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. అత్యవసర విభాగంలోని ఐదో అంతస్తులో మంటలు చెల రేగాయి. కిటికీల నుంచి దట్టమైన పొగలు బయటకు రావడంతో అందరూ బయటకు పరుగు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా, ఈ ప్రమాదంపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ఈ దుర్ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని తెలిపారు. ఆస్తి నష్టం కూడా స్వల్పంగానే వాటిల్లినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి నిమ్స్ డైరెక్టర్‌తో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో అధికారులు, ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోగులందరినీ సురక్షిత గదుల్లోకి తరలించినట్లు తెలిపారు.

Related posts

లొంగిపోయిన మావోయిస్టులకు నగదును అందజేసిన జిల్లా ఎస్పీ సునీల్ దత్!

Drukpadam

ఏకంగా 1,020 సినిమాలను హ్యాక్ చేశాడు… పోలీసుల విచారణలో సంచలన విషయాల వెల్లడి!

Ram Narayana

నన్ను వేశ్యగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు…

Drukpadam