sitarama project
తెలంగాణ వార్తలు

సీతారామ ప్రాజెక్టులకు టీఏసీ గ్రీన్ సిగ్నల్

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ , సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ సమీకృత డీపీఆర్ కుసెంట్రల్ వాటర్ కమిషన్  గురువారం (సాంకేతిక సలహా కమిటీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సీతారామ ప్రాజెక్టు పనులకు అడ్డంకులు తొలగి పోయాయి. టీఏసి సీతారామ ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపడంతో లక్షలాది ఎకరాల బీడు భూములు సాగులోకి రానున్నాయి. 2023 జనవరి 27న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ డీపీఆర్ అనుమతులు కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో పలు మార్లు సమావేశాలు జరిగిన తర్వాత ప్రాజెక్టుకు అనుమతులు లభించాయి. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 11 నియోజకవర్గాలు 31 మండలాల్లో 4,15,620 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 3,72,068 ఎకరాల ఆయకట్టు  స్థిరీకరణ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కి సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ డైరెక్టరేట్ నుండి 67.05 టి.యమ్.సి లు (సాగు నీటికి 63.13 టి.యమ్.సి, అలాగే త్రాగు నీటి కోసం 2.12 టి.యమ్.సి మరియు ఎవపోరేషన్ కు 1.80 టి.యమ్.సి)  వాడుకొనేందుకు అనుమతులు లభించాయి.

బీడు భూములు సస్యశ్యామలమవుతాయి … డిప్యూటీ సీఎం భట్టి

సీతారామ ప్రాజెక్టుల ద్వారా ఖమ్మం జిల్లాలోని వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కేంద్రానికి స్పష్టమైన సమాచారం ఇప్పించి, వారిని ఒప్పించి అధికారిక అనుమతులు సాధించారని భట్టి మంత్రి ఉత్తంను అభినందించారు. మంత్రి ఉత్తం ప్రయత్నం ద్వారా భవిష్యత్తులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున బీడు భూములు సాగు చేసుకునేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు. దశాబ్దాల తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం మూలంగా అధికారిక అనుమతులు సాధించడం అభినందనీయం అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు … మంత్రి తుమ్మల

ప్రాజెక్టును శర వేగంగా పూర్తి చేయాలని తలంపుతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మహబూబాద్ జిల్లా ప్రజల పక్షాన రైతాంగం పక్షాన మంత్రి తుమ్మల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ ద్వారా 282.80 మెగా వాట్ జల విద్యుత్ ఉత్పత్తి కి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఇచ్చినట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మరియు  సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ డి.పి.ఆర్  కు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ వారి నుండి సాంకేతిక సలహా కమిటీ అనుమతుల కోసం ఫిబ్రవరి12న కేంద్ర జలశక్తి శాఖ సెక్రెటరీ దేబశ్రీ ముఖర్జీ ఆద్వర్యంలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 157 వ సమావేశంలో ఫైల్ అందజేసినట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ప్రస్తుతం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ 104 వ కిలో మీటరు వరకు నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే సత్తుపల్లి ట్రంకు, పాలేరు లింకు కాలువలో 60 కిలో మీటర్ల వరకు పూర్తి చేసినట్లు వెల్లడించారు. మిగిలిన 125 కిలో మీటర్ల కాలువ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 8 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీలు అన్నింటికీ టెండర్లు నిర్వహించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన భూసేకరణ నిమిత్తము ఎల్పీ షెడ్యూల్స్  సంబందిత జిల్లా కలెక్టర్లను (ఖమ్మం , కొత్తగూడెం) గ్రామ సభలు మరియు ఎంజాయిమెంట్ సర్వే పురోగతి దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టును పరుగులు పెట్టించి నిర్మాణం పూర్తి చేసి ప్రజల కు సాగు, త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.

Related posts

 తెలంగాణ ఆర్టీసీ విలీనం బిల్లుకు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్!

Ram Narayana

భార్యపై కోపంతో అత్తింటికి నిప్పుపెట్టి పరారైన అల్లుడు..

Ram Narayana

ఫిబ్రవరి 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం!

Ram Narayana