తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. ఫైళ్లు క్లియరెన్స్ కోసం చాలా మంది మంత్రులు డబ్బులు తీసుకుంటారని ఆమె కామెంట్స్ చేసినట్లు ప్రచారం జరిగితోంది. ఇది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో సమంత, చైతుల డైవర్స్ పై ఆమె చేసిన కామెంట్లు కూడా వివాదాస్పదమయ్యాయి. వేముల వాడకు వెళ్లి.. అక్కడ స్వామి వారి నైవేద్యం ఆలస్యమయ్యేలా చేశారని వార్తల్లో కెక్కారు. మరో సారి ఏకంగా మంత్రి శ్రీధర్ బాబును .. తమ బంధువు కొడుక్కు ఐటీ జాబ్ ఇప్పించాలని స్టేజీ మీదనే అడిగిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇక తాజాగా.. మంత్రి కొండా సురేఖ ఏకంగా ఫైళ్ల క్లియరెన్స్ లు, అనుమతులు మంజురు చేయడానికి చాలా మంది మంత్రులు డబ్బులు డిమాండ్ చేస్తారన్న మాటలు ప్రస్తుతం వైరలవుతున్నాయి.

previous post