KTR
తెలంగాణ వార్తలు

జిమ్ చేస్తూ గాయ పడ్డ కేటీఆర్

బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా గాయ పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆర్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్లిప్ డిస్క్ వంటి గాయానికి వైద్యులు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. గాయం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేటీఆర్ కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు సైతం ఆయనకు విశ్రాంతి అవసరమని అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ కూడా డాక్టర్ల సూచన మేరకు తాత్కాలికంగా తన కార్యకలాపాలకు విరామం ఇవ్వనున్నారు. “చిన్న గాయం మాత్రమే. త్వరలోనే పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజల ముందుకు వస్తాను,” అంటూ కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మానసికంగా తాను బలంగా ఉన్నానని, త్వరలోనే తన రాజకీయ కార్యక్రమాలను తిరిగి ప్రారంభించబోతున్నట్లు ఆయన హామీ ఇచ్చారు.

Related posts

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ

Ram Narayana

మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి గుడ్ డెసిషన్ ….

Ram Narayana

ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు… బంజారాహిల్స్ పీఎస్‌లో కేటీఆర్‌పై కేసు నమోదు!

Ram Narayana