ప్రపంచ ‘మానవాభివృద్ధి సూచీ (HDI)’లో భారత్ (India) పురోగతి సాధించింది. 2023 ఏడాదికి సంబంధించి మొత్తం 193 దేశాల్లో భారత్‌కు 130వ స్థానం దక్కింది. అంతకు ముందు ఏడాది 2022తో పోల్చుకుంటే మూడు స్థానాలు మెరుగు పడింది. 2022 ఏడాదికి సంబంధించిన మానవాభివృద్ధి సూచీలో భారత్ 133వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఏడాది మూడు స్థానాలు పురోగతి చెందింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) కి సంబంధించిన మానవాభివృద్ధి సూచీ-2025 నివేదిక మంగళవారం విడుదలైంది. ఈ నివేదికలో 2023 ఏడాదికి సంబంధించిన డేటాను ప్రకటించారు. అదే విధంగా లింగ అసమానత సూచీలో కూడా భారత్ వృద్ధిని నమోదు చేసింది. 2023లో మొత్తం 193 దేశాల్లో భారత్ 102వ స్థానంలో నిలిచింది. అంతకు ముందు ఏడాది అంటే 2022లో 166 దేశాల్లో భారత్ 108వ స్థానం దక్కించుకుంది. అంటే ఈ ఏడాది ఆరు స్థానాలు మెరుగు పడింది. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ – 2025 ప్రకారం భారతీయుల జీవిత కాలం కూడా మెరుగు పడింది. 2023లో భారత పౌరుడి సగటు జీవిత కాలం 72 ఏళ్లుగా నమోదైంది. అంతకు ముందు ఏడాది అంటే 2022లో భారత పౌరుడి సగటు జీవిత కాలం 71.7 ఏళ్లుగా ఉంది. ఇప్పటికే వరకు ఇచ్చిన నివేదికల్లో ఇదే అత్యధిక సగటు జీవిత కాలమని యూఎన్‌డీపీ తెలిపింది. 1990లో భారత పౌరుడి సగటు జీవిత కాలం అతి తక్కువగా 58.6 ఏళ్లు ఉందని వెల్లడించింది.
previous post