Kunamneni Sambashiva Rao
తెలంగాణ వార్తలు

ఉగ్రవాదం దేశానికి పెను ప్రమాదం – ఈర్లపుడి సభలో కూనంనేని

  • పెరుగుతున్న ఆర్థిక అంతరాలు
  • కమ్యూనిజానికి ప్రత్యామ్నాయం లేదు

ఉగ్రవాదం దేశానికి ప్రమాదమని, అది ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదాన్ని తుద ముట్టించాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివ రావు అన్నారు. -ఉగ్రవాదంపై పోరుకు భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే కాకుండా కవ్వింపు చర్యలకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంత సంబురాల్లో భాగంగా గురువారం రఘునాథపాలెం మండల పరిధిలోని ఈర్లపుడిలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముందు గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అరుణ పతాకాన్ని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు -ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి శాఖమూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ దేశంలో ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయని, సంపద కొందరి చేతుల్లో పోగుపడుతుందన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గడిచిన రెండు దశాబ్దాలలో సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరగ్గా దారిద్య్ర రేఖకు -దిగువన జీవించే వారి సంఖ్య క్రమేపి పెరుగుతూ వచ్చిందన్నారు. కుటుంబ అవసరాలకు కనీసం ఖర్చు చేయ లేని -ఆర్థిక ఇబ్బందులు వున్న కుటుంబాల సంఖ్య పెరగడం ఇబ్బందికరమన్నారు. మతం మాటున కర్మ సిద్ధాంతాన్ని తీసుకు వస్తున్నారని ఇది ప్రమాదకరమని కూడా సాంబశివ రావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, అదే పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సైతం పరిగణలోకి తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. ప్రపంచంలో కమ్యూనిజానికి ప్రత్యామ్నాయం మరో సిద్దాంతం లేదని అన్నారు. వందేళ్ల సుదీర్ఘ పోరాటంలో అనేక విజయాలను సాధించడం జరిగిందని, పేదల పక్షాన నిరంతరం నికరంగా పోరాడేది ఎర్ర జెండా మాత్రమేనన్నారు. స్వాతంత్య్ర సమరంలోనూ సాయుధ తెలంగాణ పోరాటంలోనూ భారత కమ్యూనిస్టు పార్టీ విరోచిత పాత్ర పోషించిందని నాటి పోరాట ఘట్టాలను నేటి తరాలకు తెలియజేసేందుకు శత వసంత సభలను నిర్వహిస్తున్నామన్నారు. కమ్యూనిస్టు పార్టీ లేకుంటే హక్కులు సాధించ బడేవి కావని యువజన విద్యార్థి కార్మిక, కర్షక, మహిళా హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం ఎర్ర -జెండా నిరంతరం పోరాడుతుందన్నారు. సమాజాన్ని మార్చేది, మార్చగలిగేది ఎర్ర జెండా మాత్రమేనని కూనంనేని పేర్కొన్నారు. ఎన్నికలు కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ క్రమంలో ఒక భాగం మాత్రమేనని ప్రజా సమస్యల పరిష్కారానికి తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. ఈ సభలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా తదితరులు ప్రసంగించగా రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, ఎస్కె జానిమియా, జిల్లా కార్యవర్గ సభ్యులు -శింగు నర్సింహారావు, తాటి వెంకటేశ్వర్లు, అజ్మీర రామ్మూర్తి, పగడాల మల్లేష్, నాయకులు వరద నర్సింహారావు, -బాగం ప్రసాద్, వెంకయ్య, బానోత్ రవి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణలో అకాల వర్షం.. వడగళ్ల బీభత్సం..!

Ram Narayana

స్పీకర్ అనర్హత నోటీసులు: గడువు కోరిన ఎమ్మెల్యే దానం నాగేందర్…

Ram Narayana

లులు మాల్‌లో అసభ్య ప్రవర్తన.. ఫ్యాన్స్‌పై ఫిర్యాదు చేయడం ఇష్టంలేదన్న నటి నిధి అగర్వాల్

Ram Narayana