Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వి.హనుమంతరావుకు ఫోన్ చేసిన సోనియాగాంధీ…

వి.హనుమంతరావుకు ఫోన్ చేసిన సోనియాగాంధీ
-ఆరోగ్యంపై ఆరా ….
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచన
మీ అనుభవం కాంగ్రెస్ పార్టీకి అవసరమన్న సోనియా

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వీహెచ్ కు ఆమె నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు.

ఈ సందర్భంగా తన ఆరోగ్యం బాగానే ఉందని సోనియాకు వీహెచ్ తెలియజేశారు. జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వీహెచ్ కు సోనియా సూచించారు. త్వరగా కోలుకోవాలని, మీ రాజకీయ అనుభవం కాంగ్రెస్ పార్టీకి అవసరమని చెప్పారు. తనకు ఫోన్ చేసిన సోనియాకు వీహెచ్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

వి హెచ్ గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా ముద్ర ఉంది.నేరుగా సోనియాగాంధీ అపాయింట్మెంట్ లేకుండానే వంటింట్లో చొరబడేంత చొరవ ఉన్నవాడు … ఇటీవల కాలంలో ఆయన టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికలో సీనియర్లకు అవకాశం ఇవ్వాలని కోరారు . అంతే కాకుండా రేవంత్ రెడ్డి ఎంపికను బాహాటంగా వ్యతిరేకించారు. ఆయన్ను నియమిస్తే ఎవరిదారి వారు చూసుకుంటారని హెచ్చరికలు కూడా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పైకూడా ఆయన ఆరోపణలు చేశారు. ఎంతమంది ఎన్ని అభ్యంతరాలు పెట్టినప్పటికీ అధిష్టానం రేవంత్ వైపే మొగ్గుచూపింది.

విహెచ్ హాస్పటల్ లో ఉన్న విషయం తెలుసుకున్న నూతన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదర్ గూడా లోని అపోలో ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను పరాపర్శించారు. త్వరగాకోలుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ ను అభినందించిన విహెచ్ కొన్ని సూచనలు చేశారు.

రేవంత్ నియామకాన్ని అసలే వద్దన్న వి హెచ్ మెత్తబడటంతో రేవంత్ రిలాక్స్ అయ్యారు . ఇక సోనియా నుంచి వి హెచ్ కు ఫోన్ రావడంతో పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Related posts

జగన్ ఆదేశిస్తే పవన్ పై పోటీ చేయడానికి సిద్ధం: అలీ

Drukpadam

విరాళాల రూపంలో బీజేపీపై వందల కోట్ల వర్షం!

Drukpadam

కొడవళ్ళతో దోస్తీ… గులాబీ లో కలవరం ….

Drukpadam

Leave a Comment