క్రైమ్ వార్తలు

చిన్నస్వామి ఘటనలో బిగ్ ట్విస్ట్ .. ముందే హెచ్చరిస్తు సర్కారుకు లేఖ రాసిన సీనియర్ పోలీసు .. వెలుగులోకి షాకింగ్ నిజం

కర్ణాటకలోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ టీమ్ సభ్యుల్ని సన్మానించేందుకు ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. దాదాపు.. పద్దేనిమిదేళ్ల తర్వాత  ఆర్సీబీ కప్ సాధించడంతో  అభిమానులు దేశమంతట సంబరాలు జరుపుకున్నారు. కానీ చిన్నస్వామి స్టేడియంకు అనుకొని విధంగా ఫ్యాన్స్ తరలిరావడంతో నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో భారీగా తొక్కిసలాట చోటు చేసుకుంది. గేట్లు, గోడలు దూకి.. అభిమానులు స్టేడియంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో భారీగా తోపులాట జరిగి.. అనేక మంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 11 మంది ఆర్సీబీ అభిమానులు ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మందికి పైగా అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. ఈక్రమంలో ప్రస్తుతం ఆర్జీబీ ఘటనపైదేశ వ్యాప్తంగా దుమారంగా మారింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా విచారణ ప్రారంభించింది. అయితే.. ఈ ఘటనలో ఇప్పటి వరకు.. పోలీసు కమిషన్ దయానంద్, ఇంటెలిజెన్స్ చీఫ్ హేమంత్ నింబాల్ర్ సహా, సీఎం సిద్దరామయ్య కార్యదర్శి కె. గోవింద రాజన్ లపై సస్పెన్షన్ లు విధించారు. ఈ అంశం కూడా వివాదాస్పదంగా మారింది. ఇదిలా ఉండగా.. బెంగళూరు ఆర్సీబీ ర్యాలీ కన్నా ముందు..  ఒక డీసీపీ  కరిబసవన గౌడ ప్రభుత్వంతో పాటు, ఇతర ఉన్నతాధికారులకు ఆర్సీబీ ఈవెంట్ గురించి లేఖను రాసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Related posts

ఇంకా కొనసాగుతున్న ఖలిస్థాన్ మంటలు…

Drukpadam

నానమ్మ కళ్లలో ఆనందం కోసం హత్య..

Ram Narayana

ఇద్దరి ప్రాణాలు తీసిన గడ్డం గొడవ …!

Drukpadam