ప్రజాప్రభుత్వాన్ని దీవించండి … పార్టీ అభ్యర్థులను గెలిపించండి…మంత్రి పొంగులేటి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి ,ఎంపీ రఘురాంరెడ్డి పర్యటన
అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు ,శంకుస్థాపనలు
ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం…
ప్రజాప్రభుత్వాన్ని దీవించండి …వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపు నిచ్చారు ..శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి మండలాల్లో శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఆయా ప్రాంతాల్లో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి….తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ,సంక్షేమ పథకాలపై మాట్లాడారు …గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కొనసాగిస్తూనే మరిన్ని సంక్షేమ ఫలాలు పేదలకు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ..ప్రజల దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం ఏడాదిన్నర పూర్తి చేసుకుందని పేర్కొన్నారు ..
ఈ ఏడాదిన్నర కాలంలో ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు అమలు చేస్తూనే… రాష్ట్రం సుమారు 8 లక్షల 19 వేల కోట్ల అప్పులో ఉన్నప్పటికీ… గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి కళ్లలో ఆనందాన్ని చూడాలని అభివృద్ధి , సంక్షేమాన్ని రెండూ అమలు చేస్తూ వస్తుందన్నారు .ప్రతీ హామీని నెరవేర్చాలనే తపనతో ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నానని మంత్రి తెలిపారు ..
200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసిన ఒక్క రూపాయి చార్జీ లేకుండా ఉచిత బస్సు ప్రయాణం, 40శాతం మెస్ ఛార్జీలు పెంపు, 200 శాతం కాస్మొటిక్ ఛార్జీల పెంపు , రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం, క్వింటా సన్నాలకు రూ. 500 బోనస్, కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు .. రైతన్నలకి ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాల్లో రూ. 17వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే… ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన పది నెలలోనే రూ. 21 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన విషయాన్నీ గుర్తు చేశారు ..
పేదవాడు కలలు కన్న డబుల్ బెడ్ రూమ్ ఇంటి కలను ఆనాటి ప్రభుత్వం పదేళ్లుగా కలలాగానే మిగిలిస్తే … ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి రాగానే ఆ కోరిక నెరవేరుస్తూ వస్తుందన్నారు …ఆనాటి బీ ఆర్ ఎస్ ప్రభుత్వం రైతుబంధు ద్వారా ఎకరానికి రెండు విడతల్లో రూ.పదివేల రూపాయలు ఇస్తే … మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతు భరోసా పేరుతో ఎకరానికి రూ.12 వేల రూపాయలు ఇస్తున్నామన్నారు ..గత మూడు రోజుల క్రితం నుంచి రైతు భరోసా నిధులు జమ అవుతూ వస్తున్నాయన్నారు …తొమ్మిది రోజుల్లోనే మొత్తం రూ.9వేల కోట్ల రైతు భరోసా నిధులు లబ్ధిదారుల రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు ..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పేదవాడికి అండగా ఉండాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నమన్నారు .. రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వం తరుపున నిలబడే అభ్యర్థులను దీవించాలని మంత్రి పిలుపు నిచ్చారు .