తెలంగాణ వార్తలు

ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలపై నిరంతర సమీక్ష…డిప్యూటీ సీఎం భట్టి

ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలపై నిరంతర సమీక్ష…డిప్యూటీ సీఎం భట్టి
ఇసుక విక్రయ కేంద్రాల విస్తరణ…
వేగవంతంగా ఎల్ ఆర్ యస్ దరఖాస్తుల పరిస్కారం
హైద్రాబాద్ లో ఉన్న కాలుష్య పరిశ్రమలు ఓ ఆర్ ఆర్ అవతలకి తరలింపు

ఇంటి నిర్మాణ సామాగ్రిని సామాన్యులకు అందుబాటులో తెచ్చి విధంగా చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన రెవెన్యూ రిసోర్స్ మొబలైజేషన్ కమిటీ సమావేశం నిర్ణయించింది …సోమవారం హైద్రాబాద్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు పలు అంశాలపై మంత్రుల సబ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది ..

మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు ఏర్పాటు – ఇసుక, స్టీల్, సిమెంటు వంటి నిర్మాణ సామాగ్రి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు
ఇసుక విక్రయ కేంద్రాల విస్తరణ – రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశం
ప్రతిరోజూ సమీక్ష – గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలును చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రోజూ సమీక్షించాలని సూచన
LRS దరఖాస్తులపై చర్చ – పరిష్కారం వేగవంతం చేయాలన్న దిశగా సూచనలు
గిరిజనుల ద్వారా క్వారీల నిర్వహణ – మధ్యవర్తులు లేకుండా ఆదాయ మార్గాలు

కాలుష్య పరిశ్రమలు ORR వెలుపలకి తరలింపు – పారిశ్రామిక వాడల వారీగా సమీక్ష

మైన్స్ & జియాలజీ శాఖకు సంబంధించిన వన్ టైం సెటిల్మెంట్ (OTS) పై సమీక్ష

కమర్షియల్ ట్యాక్స్ ప్రగతి – దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మంచి స్థితిలో ఉందని అభిప్రాయం

ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

ఉగ్రవాదం దేశానికి పెను ప్రమాదం – ఈర్లపుడి సభలో కూనంనేని

Ram Narayana

షాద్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మహిళా కానిస్టేబుల్‌పై విద్యార్థినుల దాడి…

Ram Narayana

ఉత్తర తెలంగాణలో స్వల్ప భూకంపం

Ram Narayana