అంగరంగ వైభవంగా ఆషాడ మాసం బోనాల పండుగ
ఖమ్మం రెడ్డి పల్లి గ్రామం మారెమ్మ గుడి ప్రాంతంలో ఆషాడ మాసం బోనాల పండుగను గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాలను మహిళలు భక్తి శ్రద్దలతో తయారుచేసి డప్పు వాయిద్యాలతో , మేళతాళలతో , నృత్యలతో ఊరేగింపుగా వెళ్లి మారెమ్మ దేవాలయంలో ఉన్న అమ్మవారికి నైవేద్యం సమర్పించి బోనాలతో మొక్కులు చెల్లించి ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో , సిరి సంపదలతో , పాడిపంటలతో , సుఖ సంతోషాలుగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయం ప్రధాన అర్చకులు రామశర్మ , గుర్రం పద్మ , నాగమణి , వరలక్ష్మి , రంగమ్మ , తీగల నాగమణి , అనుమల పద్మ తదితరులు పాల్గొన్నారు.