ఖమ్మం వార్తలు

మానవత్వం లేని బీజేపీ …చవకబారు రాజకీయాలు మానుకోవాలి …ఖమ్మంలో అఖిలపక్ష నేతలు

పాలస్తీనాలో ఇజ్రాయిల్ సృష్టిస్తున్న మారణ హెూమాన్ని వ్యతిరేకిస్తూ… ప్రపంచశాంతిని కోరుతూ ఈనెల 7వ తేదీన ఖమ్మంలో నిర్వహించిన శాంతి ర్యాలీకి అపూర్వ జనాదరణ రావటాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని అఖిలపక్షాల నేతలు, సీపీఐ(ఎం), సీపీఐ, సీపీబ (ఎంఎల్) సూస్లైన్ జిల్లా కార్యదర్యులు సున్నా నాగేశ్వరరావు, దండి సురేష్, గోకినేపల్లి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ అన్నారు. మానవత్వాన్ని మరిచి బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి శాంతి ర్యాలీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రెండో ప్రపంచచయుద్ధం తర్వాత అత్యంత దారుణమైన మారణ హోమాన్ని గాజాలో ఇజ్రాయిల్ సృష్టిస్తోందన్నారు. ఇప్పటికే 80వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినా మానవత్వం లేకుండా బీజేపీ వ్యాఖ్యలు చేస్తుండటాన్ని ఖండించారు. ఖమ్మంలోని సీపీఐ(ఎం) జిల్లా కాద్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిలపక్షాల నేతలు మాట్లాడారు.

  • బీజేపీకి మనస్సు…మానవత్వం లేదు..

బీజేపీర్ మనస్సు, మానవత్వం లేదని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ప్రపంచశాంతిని కాంక్షిస్తూ ఖమ్మంలో ర్యాలీ నిర్వహిస్తే బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఓట్ల కోసం ప్రచారమంటూ చౌకబారు వ్యాఖ్యలు చేయటం అర్థరహితమని ఖండించారు. దేశం, రాష్ట్రం, జిల్లాలో ఉన్న సమస్యల్లో వేటిపై బీజేపీ పోరాటాలు చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేయటంలో కమ్యూనిస్టులను మించిన పార్టీలు ఏవైనా ఉన్నాయా అన్నారు. ఇజ్రాయిల్ మారణహోమంలో భాగంగా గాజా ప్రజలపై బాంబులు వేయటమే కాకుండా ఆకలితో మాడుస్తున్నారని, సహాయక చర్యలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి ప్రదాత మహాత్మాగాంధీ సైతం పాలస్తీనా ప్రజలకు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అటువంటిది , మోడీ ప్రభుత్వం భారత విదేశాంగ విధానానికి భిన్నంగా వ్యవహరించటం అత్యంత దారుణమన్నారు. పాలస్తీనాకు 149 దేశాలు మద్దతిస్తే మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్ తో అంటకాగుతోందన్నారు. యుద్ధానికి కావాల్సిన పరికరాలు మనదేశం నుంచి సరఫరా చేస్తుండటం దుర్మార్గమన్నారు. బీజేపీకి మతం తప్ప ఏ సమస్య పట్టదన్నారు. తానే భారత్- పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే మోడీ ఎందుకు ఖండించటం లేదన్నారు. భారత ఆర్థికవ్యవస్థ మృత ఆర్థిక వ్యవస్థ అని వ్యాఖ్యానించినా ఖండించటం లేదన్నారు. దిగుమతులపై అమెరికా 50శాతం పన్నులు పెంచినా బీజేపీకి పట్టడం లేదని తెలిపారు. ప్రయివేటు విద్యాసంస్థల విద్యార్థులు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్న విషయాన్ని బీజేపీ నేతలు గ్రహించాలన్నారు.

  • బీజేపీది గాడ్చే మనస్థత్వం…

బీజేపీది గాడ్సే మనస్థత్వం అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అన్నారు. ప్రాణనష్టం జరిగినప్పుడు స్పందించాల్సింది పోయి అనుచిత వ్యాఖ్యలు చేయటం బీజేపీ నేతలకే చెల్లిండన్నారు. బీజేపీ వెలివేసిన పార్టీ… ఆదో పాసిస్ట్ పార్టీ అని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. హిట్లర్ పంథాను అనుసరించే పార్టీ అన్నారు. ఓట్ల దొంగతనం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీగా పేర్కొన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎలాంటి పాత్రలేని పార్టీ బీజేపీ అని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ వ్యాఖ్యానించారు. బీజేపీకి ఏనాడూ ప్రజా సమస్యలపై పోరాడిన నేపథ్యం లేదన్నారు. విధ్వంసాలు చేసి ప్రాణాలు తీయటాన్ని ఖండిస్తూ ప్రదర్శన చేస్తే… సున్నితమైన విషయాన్ని రాజకీయం చేయటం బీజేపీకే చెల్లిందని బీఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు అన్నారు. కమ్యూనిస్టులు ఏ అధికారం కోసం పోరాటాలు చేస్తున్నారో చెప్పాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇజ్రాయిల్ యుద్ధకాండకు వ్యతిరేకంగా లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి శాంతి ర్యాలీలు నిర్వహిస్తుంటే కనిపించటం లేదా? అని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో అఖిలపక్షాల నేతలు వై. విక్రమ్, అవుల అశోక్, శింగు నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం జోరు …కాంగ్రెస్ 8 ,సిపిఐ 1 బీఆర్ యస్ 1

Ram Narayana

కందాల కన్నీరు పై ప్రజల్లో చర్చ …

Ram Narayana

సామినేని రామారావు హంతకులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం..సిపిఎం నేతలుధ్వజం!

Ram Narayana