అంతర్జాతీయం

అమెరికా ఆశలకు గండి.. తెలుగు యువత డాలర్ డ్రీమ్స్‌కు ట్రంప్ బ్రేక్!

అమెరికా డాలర్ ఆశలకు ట్రంప్ నీళ్లు చెల్లారు …h1 బి వీసా ఫీజు ఒక్కసారిగా లక్ష డాలర్లకు పెంచడం టెక్కీలకు ఫిడుగులాంటి వార్తే … ప్రధానంగా ట్రంప్ పెంచిన h1 బి వీసా ఫీజు చెల్లించాలంటే తలకు మించిన భారంగా మారింది …దీన్ని ఏ కంపెనీలు భరించేందుకు సిద్దపడకపోవచ్చు …పైగా ఈ ఫీజు ప్రతి ఏడాది చెల్లించాలని , లేదు ఒక్కసారి చెల్లిస్తే సరిపోతుందని రకరకాల వార్తలు వచ్చాయి…h1 వీసా దారులందరు సెప్టెంబర్ 20 లోపు రిపోర్ట్ చేయాలనీ ,అమెరికా ఉండాలని షరతులు విధించిడంతో టెక్కీలు అమెరికాకు పరుగులు తీసే ప్రయత్నం చేశారు …ఇది అదునుగా విమానయానసంస్థలు భారీగా టిక్కెట్ల రేట్లు పెంచాయి..చాలామందికి టిక్కెట్లు కూడా దొరకక లబోదిబోమన్నారు …కనీసం దుబాయ్ ,అబుదాబి , లండన్ ,దోహా , ఖతార్ ,హాంకాంగ్ లాంటి దేశాల వరకు వెళ్లి అక్కడ నుంచి వెళ్లాలని చేసిన ప్రయత్నాలు కూడా ఫలించకపోవడం తో లబోదిబోమంటున్నారు …అమెరికా నుంచి ఇండియాకు రావాలని అనుకున్న అనేక మంది టెక్కీలు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు …శాన్ ఫ్రాన్సిస్ కో లో ఇండియా వచ్చేందుకు విమానం ఎక్కినా అనేకమంది భారత్ టెక్కీలు ట్రంప్ ప్రకటన తెలుసుకొని విమానం దిగిపోయారని సమాచారం …

అమెరికాలో ఉన్న H-1B వీసా హోల్డర్లు + వారి ఆధారితులు మొత్తం సుమారు 1.3 మిలియన్ల మంది (13 లక్షల మంది) ఉండవచ్చు అని ఒక లేటెస్ట్ అంచనా.

దీనిలో H-1B హోల్డర్లు (ఉద్యోగం చేసే వారు) సుమారు 7,30,000 (7.3 లక్షల) మంది.

H-1B వీసా ప్రభావం ప్రధానంగా రెండు దేశాలపై ఎక్కువగా ఉంటుంది:

అమెరికా

సాంకేతిక రంగం అభివృద్ధి: ఎక్కువ శాతం H-1B వీసా హోల్డర్లు అమెరికాలోని ఐటీ, హెల్త్‌కేర్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో పనిచేస్తారు.

టాలెంట్ అందుబాటు: అమెరికా కంపెనీలకు తక్కువ ఖర్చుతో ఉన్నత స్థాయి టాలెంట్ అందుతుంది.

ఆర్థిక ప్రోత్సాహం: ఈ వీసాతో వచ్చిన ప్రొఫెషనల్స్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు పన్నులు, వినియోగం ద్వారా సహాయం చేస్తారు.

భారతదేశం

రెమిటెన్సులు అమెరికాలో పనిచేసే భారతీయులు తమ కుటుంబాలకు డబ్బు పంపించడం వల్ల దేశానికి విదేశీ మారకద్రవ్యం వస్తుంది.

నైపుణ్యాభివృద్ధి తిరిగి వచ్చిన తర్వాత వారు సంపాదించిన అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం దేశ అభివృద్ధికి దోహదపడుతుంది.

అదే సమయంలో, ప్రతిభావంతులైన యువత విదేశాలకు వెళ్లిపోవడం వల్ల దేశంలో “బ్రెయిన్ డ్రెయిన్” సమస్య పెరుగుతుంది.

👉 మొత్తానికి, H-1B వీసా అమెరికాకు నైపుణ్యం, భారత్‌కు విదేశీ ఆదాయం తెస్తుంది. కానీ, ఇరుదేశాలకూ పాజిటివ్ మరియు నెగటివ్ ప్రభావాలు ఉంటాయి.

  • హెచ్‌1-బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ సర్కార్
  • తెలుగు రాష్ట్రాల యువత అమెరికా కలలపై తీవ్ర ప్రభావం
  • కనీస వేతనం 1.50 లక్షల డాలర్లకు పెంపుతో కంపెనీలకు భారం
  • ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం
  • భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారంటూ ఆరోపిస్తున్న ప్రవాస సంఘాలు

అమెరికాలో ఉద్యోగం చేసి డాలర్లు సంపాదించాలనే లక్షలాది మంది భారతీయుల ఆశలపై, ముఖ్యంగా తెలుగు యువత కలలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం నీళ్లు చల్లింది. హెచ్‌1-బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ సర్కార్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయనుంది.

ఇప్పటివరకు అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి హెచ్‌1-బీ వీసాలను ఒక మార్గంగా ఉపయోగించుకునేవి. అయితే, తాజా నిబంధనల ప్రకారం కంపెనీలు కేవలం లక్ష డాలర్ల ఫీజు చెల్లించడమే కాకుండా, ఆ ఉద్యోగికి ఏటా కనీసం 1.50 లక్షల డాలర్ల వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో సగటున లక్ష డాలర్ల వార్షిక వేతనం ఇస్తుండగా, ఇప్పుడు ఫీజుకే అంత మొత్తం చెల్లించాల్సి రావడంతో కంపెనీలు విదేశీయులను నియమించుకోవడానికి వెనకడుగు వేసే అవకాశం ఉంది. స్థానికులకే ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రభుత్వం పేర్కొంటోంది.

ప్రతి ఏటా అమెరికా జారీ చేసే 85 వేల హెచ్‌1-బీ వీసాల్లో సుమారు 73 శాతం, అంటే దాదాపు 62 వేల వీసాలను భారతీయులే దక్కించుకుంటున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య 35 వేల వరకు ఉంటుందని అంచనా. తాజా నిర్ణయంతో వీరి అమెరికా ప్రయాణం దాదాపు అసాధ్యంగా మారనుంది.

ఈ ప్రభావం కేవలం ఉద్యోగార్థులపైనే కాకుండా, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే విద్యార్థులపైనా పడనుంది. చదువు పూర్తయ్యాక ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) ద్వారా ఉద్యోగంలో చేరి, హెచ్‌1-బీ వీసా పొందే మార్గం ఇప్పుడు దాదాపు మూసుకుపోయినట్లేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరమైన విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలోనే ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని, ఇది భారతీయులను పరోక్షంగా లక్ష్యం చేసుకోవడమేనని అక్కడి తెలుగు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

అమెరికాలో గందరగోళం.. స్వదేశానికి ప్రయాణాలను రద్దు చేసుకుంటున్న భారతీయులు

Donald Trump H1B Visa Fee Hike Causes Travel Chaos for Indians
  • హెచ్-1బీ వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ సంచలన నిర్ణయం
  • నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధన
  • భయంతో స్వదేశానికి ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న ఎన్నారైలు
  • ఇతర దేశాల్లో ఉన్నవారు హుటాహుటిన అమెరికాకు తిరుగు ప్రయాణం
  • భారత్ నుంచి అమెరికాకు విమాన టికెట్ల ధరలకు రెక్కలు
  • హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా పెరిగిన రద్దీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం హెచ్-1బీ వీసాదారుల జీవితాలను తలకిందులు చేసింది. హెచ్-1బీ వీసా రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు (సుమారు రూ. 88 లక్షలు) పెంచుతున్నట్లు ఆయన చేసిన ప్రకటనతో అమెరికాలోని ప్రవాస భారతీయుల్లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ కొత్త నిబంధన ఈ రోజు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ఆకస్మిక నిర్ణయంతో అమెరికాలోని విమానాశ్రయాల్లో శుక్రవారం నుంచి తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. ముఖ్యంగా దసరా, దీపావళి పండుగల కోసం భారత్‌కు రావాలని సిద్ధమైన ఎంతోమంది తమ ప్రయాణాలను వెంటనే రద్దు చేసుకున్నారు. ఇప్పుడు అమెరికా విడిచిపెడితే, తిరిగి రావడానికి లక్ష డాలర్ల భారీ రుసుము చెల్లించాల్సి వస్తుందనే భయంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, ఇతర దేశాల్లో ఉన్న హెచ్-1బీ వీసాదారులు కొత్త నిబంధన అమల్లోకి రాకముందే అమెరికా చేరుకోవాలని పరుగులు పెడుతున్నారు.

ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో జరిగిన ఓ ఘటనే నిదర్శనం. బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఎమిరేట్స్ విమానం ఎక్కిన పలువురు భారతీయ ప్రయాణికులు, ట్రంప్ ప్రకటన గురించి తెలుసుకుని హుటాహుటిన కిందకు దిగిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.

ట్రంప్ నిర్ణయం ప్రభావం విమాన టికెట్ల ధరలపై కూడా తీవ్రంగా పడింది. భారత్ నుంచి అమెరికా వెళ్లే విమానాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోవడంతో ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణంగా న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు రూ. 40,000 ఉండే ఎకానమీ క్లాస్ టికెట్ ధర, శనివారం నాటికి రూ. 80,000 దాటిపోయింది. ఇదే పరిస్థితి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోనూ కనిపించింది. అమెరికా వెళ్లే ప్రయాణికులు, వారి కుటుంబసభ్యులతో విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. గడువులోగా అమెరికా చేరుకోవాలన్న ఆత్రుత ప్రయాణికుల్లో స్పష్టంగా కనిపించింది.

హెచ్-1బీ వీసాపై లక్ష డాలర్ల ఫీజుపై వైట్‌హౌస్ క్లారిటీ

H1B Visa Fee only for new petitions not renewals says White House
  • కొత్తగా జారీ చేసే వీసాల‌కే లక్ష డాలర్ల ఫీజు విధిస్తామ‌న్న వైట్‌హౌస్‌
  • ప్రస్తుత వీసాదారులకు, రెన్యూవల్స్‌కు ఇది వర్తించదని స్పష్టీక‌ర‌ణ‌
  • అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమ‌ని వెల్ల‌డి
  • కంపెనీలు విచ్చలవిడిగా దరఖాస్తు చేయకుండా నిరోధించేందుకే ఈ చర్య
  • ఈ నిర్ణయం భారతీయులపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా విధానంలో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టారు. అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలనే లక్ష్యంతో కొత్తగా జారీ చేసే హెచ్-1బీ వీసాలపై భారీగా ఫీజు విధించే కీలక ప్రకటనపై ఆయ‌న‌ సంతకం చేశారు. దీని ప్రకారం కంపెనీలు కొత్తగా విదేశీ ఉద్యోగి కోసం హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేస్తే లక్ష డాలర్ల (సుమారు రూ. 88 లక్షలు) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, ఈ నిర్ణయంపై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో శనివారం వైట్‌హౌస్ ఒక స్పష్టత ఇచ్చింది. ఈ ఫీజు కేవలం కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా కలిగి ఉన్నవారికి లేదా రెన్యూవల్ చేసుకునే వారికి ఇది వర్తించదని ఓ వైట్‌హౌస్ అధికారి మీడియాకు తెలిపారు. ఇది ఒక్కసారి మాత్రమే చెల్లించాల్సిన ఫీజు అని, రాబోయే లాటరీ సైకిల్ నుంచి అమల్లోకి వస్తుందని ఆయన వివరించారు.

ఈ విధానం ద్వారా కంపెనీలు విచ్చలవిడిగా వీసాల కోసం దరఖాస్తు చేయడాన్ని (స్పామింగ్) నిరుత్సాహపరచవచ్చని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి టేలర్ రోజర్స్ తెలిపారు. “అమెరికన్ వర్కర్లకే ప్రాధాన్యం ఇస్తామని అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం ఆ దిశగా వేసిన ముందడుగు. వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న కంపెనీలను ఇది నివారిస్తుంది” అని ఆమె అన్నారు.

వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారు. “ఇకపై పెద్ద టెక్ కంపెనీలు విదేశీ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే బదులు, మా దేశంలోని విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన అమెరికన్లకు శిక్షణ ఇస్తాయి. కంపెనీలు ప్రభుత్వానికి లక్ష డాలర్లు చెల్లించి, ఆ తర్వాత ఉద్యోగికి జీతం ఇవ్వడం ఆర్థికంగా లాభదాయకం కాదు” అని ఆయన వివ‌రించారు.

ఈ నిర్ణయం భారతీయులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్యూ రీసెర్చ్ డేటా ప్రకారం, 2023లో జారీ అయిన మొత్తం హెచ్-1బీ వీసాలలో దాదాపు 73 శాతం మంది భారతీయులే పొందారు. అధిక సంఖ్యలో నైపుణ్యం కలిగిన వలసదారులు ఉండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

రంగంలోకి భారత ప్రభుత్వం.. హెచ్-1బీ వీసాదారుల కోసం ఎమర్జెన్సీ నంబర్

Indian Embassy in US issues emergency helpline amid H1B visa fee
  • హెచ్-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన
  • తీవ్ర ఆందోళనలో భారతీయ టెక్ నిపుణులు
  • ఇది కొత్త వీసాలకేనని, ప్రస్తుత వీసాదారులకు వర్తించదని స్పష్టం చేసిన వైట్‌హౌస్
  • భారతీయుల కోసం ఎమర్జెన్సీ సహాయ నంబర్‌ను ప్రకటించిన భారత ఎంబ‌సీ
  • కుటుంబాలపై ప్రభావం చూపుతుందని భారత విదేశాంగ శాఖ ఆందోళన

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ టెక్ నిపుణులకు తీవ్ర ఆందోళన కలిగించే పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారిపై ఏకంగా 100,000 డాలర్ల (సుమారు రూ. 83 లక్షలు) వార్షిక రుసుమును విధిస్తూ ఒక ప్రకటనపై సంతకం చేశారు. ఈ నిర్ణయం భారతీయ నిపుణులలో కలకలం రేపింది.

ఈ ప్రకటన వెలువడిన వెంటనే వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. తక్షణ సహాయం అవసరమైన భారతీయ పౌరుల కోసం శనివారం ఒక ఎమర్జెన్సీ సహాయ నంబర్‌ను విడుదల చేసింది. “అత్యవసర సహాయం కావాల్సిన వారు 1-202-550-9931 నంబర్‌కు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. సాధారణ వీసా సంబంధిత ప్రశ్నలకు కాకుండా, తక్షణ సహాయం కోసం మాత్రమే ఈ నంబర్‌ను సంప్రదించాలి” అని ఎంబసీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలిపింది.

భారీగా పెంచిన ఈ ఫీజుపై నెలకొన్న గందరగోళంపై వైట్‌హౌస్ స్పష్టతనిచ్చింది. ఈ రుసుము కేవలం కొత్తగా హెచ్-1బీ వీసా కోసం పిటిషన్ దాఖలు చేసేవారికి మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా కలిగి ఉన్నవారికి లేదా రెన్యూవల్ చేసుకునేవారికి ఇది వర్తించదని ఒక సీనియర్ అధికారి తెలిపారు. “ఇది ఒక్కసారి చెల్లించే ఫీజు. రాబోయే లాటరీ సైకిల్ నుంచి అమల్లోకి వస్తుంది” అని వైట్‌హౌస్ అధికారి ఒకరు ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ప్రత్యేకంగా వివరించారు.

మరోవైపు, ఈ పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాబోయే పర్యవసానాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తోంది. ఇది కేవలం ఆర్థికపరమైన అంశమే కాకుండా, ఎన్నో కుటుంబాలపై మానవతా సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

“హెచ్-1బీ వీసాపై ప్రతిపాదిత ఆంక్షలకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వం గమనిస్తోంది. దీని పూర్తి ప్రభావంపై భారత పరిశ్రమ వర్గాలతో సహా సంబంధిత అన్ని వర్గాలు అధ్యయనం చేస్తున్నాయి” అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ చర్య వల్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. మొత్తం హెచ్-1బీ వీసాలలో సుమారు 71 శాతం భారతీయులకే మంజూరు అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

హెచ్‌-1బీ సెగ: ట్రంప్ నిర్ణయంతో తెలుగు టెకీలు విలవిల.. కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్‌

CM Revanth Reddy demands center intervention on H1B visa issue
  • హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్ ఉత్తర్వులు దిగ్భ్రాంతికరం అన్న సీఎం రేవంత్
  • తెలుగు టెకీల ప్రయోజనాల కోసం కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్
  • ట్రంప్ నిర్ణయంతో తెలంగాణకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందన్న‌ మంత్రి శ్రీధర్ బాబు
  • దేశానికి వచ్చే రెమిటెన్స్‌లలో తెలంగాణకు నాలుగో స్థానం
  • ప్రధాని మోదీ, జైశంకర్ వెంటనే అమెరికాతో చర్చలు జరపాలని విజ్ఞప్తి

హెచ్‌-1బీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ నిర్ణయం తెలుగు టెకీలపై, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.

ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు దిగ్భ్రాంతికి గురిచేశాయని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ముఖ్యమంత్రి అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఈ నిర్ణయంతో తెలుగు టెకీల ఆవేదన వర్ణనాతీతంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా అమెరికాకు సేవలు అందిస్తున్న నిపుణుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ అంశంపై శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ట్రంప్ నిర్ణయంతో దేశంలో అత్యధికంగా నష్టపోయే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆయన స్పష్టం చేశారు. దేశానికి ఏటా వచ్చే మొత్తం రెమిటెన్స్‌లలో 8.1 శాతం వాటాతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని, తాజా నిర్ణయం ఈ రాబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాస్తామని ఆయన తెలిపారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంత నష్టం జరుగుతున్నా ప్రధాని మోదీ స్పందించకపోవడం దురదృష్టకరమని శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. “ట్రంప్ ఆలోచనా విధానం ఆయన ప్రియ మిత్రుడు మోదీకే బాగా తెలుసు” అంటూ ఎద్దేవా చేశారు. సమస్య తీవ్రతను ముందుగానే అంచనా వేసి అమెరికాతో చర్చలు జరపడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రధాని, విదేశాంగ మంత్రి మేల్కొని అమెరికాతో చర్చలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.

అమెరికన్ల స్థానంలో హెచ్ 1బీ ఉద్యోగుల నియామకం.. ట్రంప్ సర్కారు ఆరోపణ

H1B Visa Fee Hike Explained Protecting American Jobs
  • స్థానిక ఉద్యోగుల ప్రయోజనాలకే వీసా ఫీజు పెంపు
  • కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దొరకట్లేదు
  • 5 వేలకుపైగా హెచ్ 1 బీ వీసాలు పొందిన ఓ కంపెనీ 16 వేల మంది అమెరికన్లను తొలగించిందన్న వైట్ హౌస్

అమెరికన్ల ప్రయోజనాలను కాపాడడానికి, స్థానిక ఉద్యోగుల భద్రత కోసమే హెచ్ 1బీ వీసా ఫీజును పెంచినట్లు వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. వీసా ఫీజును భారీగా పెంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో తాజాగా స్పందించింది. దేశంలోని పలు కంపెనీలు అమెరికన్ వర్కర్ల స్థానాన్ని హెచ్ 1 బీ ఉద్యోగులతో భర్తీ చేస్తున్నాయని ఆరోపించింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక స్థానిక కంపెనీ దరఖాస్తు చేసుకున్న 5,189 హెచ్ 1బీ వీసాలకు అనుమతి రాగానే దాదాపు 16 వేల మంది అమెరికన్లను పనిలో నుంచి తొలగించిందని వైట్ హౌస్ ఓ ప్రకటనలో ఉదహరించింది. మరో కంపెనీకి 1,698 హెచ్ 1బీ వీసాలు జారీ చేయగా.. 2,400 మంది అమెరికన్లను ఉద్యోగం నుంచి తొలగించిందని, మూడో కంపెనీకి 2022 నుంచి ఇప్పటి వరకు 25 వేల హెచ్ 1బీ వీసాలు జారీ చేస్తే.. సుమారు 27 వేల మంది స్థానిక ఉద్యోగులను ఇంటికి పంపించిందని వైట్ హౌస్ ఆరోపించింది.

అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నందునే వీసా ఫీజును భారీగా పెంచామని తెలిపింది. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన అమెరికన్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దొరకడం లేదని, వీరి నిరుద్యోగిత శాతం వరుసగా 6.5, 7.5 శాతంగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించడం, ఉద్యోగ అవకాశాలను పెంచడానికే ట్రంప్ ప్రభుత్వం హెచ్ 1బీ వీసా ఫీజును పెంచినట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో స్థానిక కంపెనీలు అత్యంత నిపుణులను, కంపెనీకి అత్యవసరమైన వారిని మాత్రమే విదేశాల నుంచి రప్పించుకుంటాయని వైట్ హౌస్ అభిప్రాయపడింది.

వన్ టైమ్ ఫీజే.. హెచ్ 1బీ వీసా ఫీజుపై వైట్‌హౌస్‌ స్పష్టత

White House Clarifies H1B Visa Fee is One Time
  • వార్షిక ఫీజు కాదన్న ప్రెస్ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌
  • ఇప్పటికే హెచ్ 1బీ వీసా ఉన్న వారికి వర్తించదని వెల్లడి
  • హెచ్ 1బీ వీసా హోల్డర్లు విదేశాలకు వెళ్లి రావచ్చని క్లారిటీ

హెచ్ 1బీ వీసా ఫీజు పెంపుపై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తాజాగా ఓ వివరణ ఇచ్చింది. వీసా ఫీజు పెంపు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అది కూడా వన్ టైమ్ ఫీజు మాత్రమేనని వార్షిక ఫీజు కాదని పేర్కొంది. ఇప్పటికే హెచ్ 1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులకు ఈ పెంపు వర్తించదని తెలిపింది. ఈ మేరకు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పష్టతనిచ్చారు.

హెచ్‌-1బీ వీసాపై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని ఆమె స్పష్టం చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్‌టైమ్‌ ఫీజు మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఈ లక్ష డాలర్ల రుసుము విధించబోమని తెలిపారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావొచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు.

Related posts

భార్యను తుపాకీతో కాల్చి చంపేసిన అమెరికా న్యాయమూర్తి

Ram Narayana

తిరుగులేని శక్తిగా నిలిచినా నికోలస్ బదురో అమెరికాకు ఎలా చిక్కాడు …

Ram Narayana

అజర్‌బైజాన్-జార్జియా సరిహద్దులో కూలిపోయిన టర్కీ సైనిక విమానం..

Ram Narayana