ఆరెంపులలో ఆనందోత్సవం… పొంగులేటి క్రీమ్ కలర్ కుర్తా పైజామా ప్రత్యేక ఆకర్షణ!
ఖమ్మం రూరల్ ఆరెంపుల గ్రామం బుధవారం పండుగ వాతావరణంలో కళకళలాడింది. కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గుమ్మాల వద్ద పూలతోరణాలు… ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులు… గృహాల చుట్టూ వినిపించిన మంగళధ్వానాలు కొత్త జీవితానికి సంకేతాలు వెలిగించాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఈ గ్రామంలో గృహప్రవేశాలు ఘనంగా జరగగా… ముఖ్య అతిథిగా తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాకతో ఉత్సవం మరింత ఉప్పొంగింది. ఈ వేడుకలో మంత్రి పొంగులేటి వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా అందరి చూపులను కట్టిపడేసింది. ఆయన ధరించిన క్రీమ్ కలర్ కుర్తా పైజామా అందరి దృష్టిని తనవైపు తిప్పేసింది. గ్రామస్తులు “పొంగులేటి శీనన్న సాదాసీదా స్టైల్ ఎంత బాగుందో!” అంటూ చర్చించుకున్నారు. కొత్తగా గృహ ప్రవేశం చేసుకున్న వారందరికీ మంత్రి పొంగులేటి అభినందనలు తెలిపి… పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాలేరు నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెంలో రూ.15కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా నిర్మించనున్న 9700 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపికైన ఆరెంపుల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా నిర్వహించిన గృహ ప్రవేశ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు అభినందనలు తెలిపి పట్టు వస్త్రాలను కానుకగా అందించారు.
అదేవిధంగా అదే గ్రామంలో ఆరెంపుల నుంచి ఖమ్మం వరకు రూ.77 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రూ. 20లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న పశుసంవర్ధక శాఖ సబ్ సెంటర్ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు.
రూ. 13.50లక్షల అంచనా వ్యయంతో ప్రాథమిక పాఠశాలలో నిర్మించనున్న అదనపు తరగతి గదుల కోసం శంకుస్థాపన చేశారు.
రూ. 15లక్షల అంచనా వ్యయంతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీకి చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు 139మందికి 44లక్షల 69వేల 500 రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆ శాఖ ఎం.డి. డాక్టర్ కొర్ర లక్ష్మి, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ బాబు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అడిషనల్ డీసీపీ రామానుజం, బాలసాని లక్ష్మినారాయణ, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, బొర్రా రాజశేఖర్, మద్ది మల్లా రెడ్డి, కళ్ళెం వెంకట్ రెడ్డి, హరినాథ్ బాబు, బండి జగదీష్, చింతమల్ల రవి, వివిధ శాఖల నియోజకవర్గ, మండల అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఆయా కార్యక్రమాలను ఉద్దేశించి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ….

రాబోయే మూడు సంవత్సరాల్లో కలిపి 5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోడౌన్‌లను నిర్మించాలనే ప్రణాళిక.
పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటిసారిగా 9,700 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం ఖమ్మం రూరల్ మండలం ఎం.వి. పాలెం గ్రామంలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది.
దీని ద్వారా రైతులు తమ పంటలను అత్యంత చౌక ధరలో నిల్వ చేయగలుగుతారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25లక్షల మంది రైతులకు రూ. 21 వేల కోట్ల రూపాయల వరకు రుణమాఫీ.
ఎకరానికి రైతు భరోసా ద్వారా రూ. 12,000 రూపాయల మద్దతు … సన్నాలకు అదనంగా క్వింటాళ్లకు రూ. 500 బోనస్ ఇవ్వడం జరిగింది.
ప్రతి పేదవాడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
500 రూపాయలకే గ్యాస్ అందచేస్తున్నాం.
కొత్త రేషన్ కార్డులు 11 లక్షల మందికి, పాత రేషన్ కార్డులలో 7 లక్షల మంది కొత్త పేర్లు చేర్చడం జరిగింది.
ఇప్పటికే నాల్గున్నర లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ.
భవిష్యత్తులో మూడు విడతల్లో ఇంకా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం.
కేంద్రం యూరియా సరఫరాలోని లోటు కారణంగా రాష్ట్రానికి సమస్యలు.
రాబోయే వారం-పది రోజుల్లో యూరియా సమస్య పరిష్కరించబడేలా ప్రయత్నం.
రైతుల సంక్షేమం, పేదవాడి జీవితాలను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది.
గౌరవ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు, అధికారులు అందరూ పేదవాడి పట్ల తపనగా పనిచేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టారు.
రాష్ట్ర విభజన తరువాత పది సంవత్సరాల పాలనలో హౌజింగ్ డిపార్ట్మెంట్ లేకుండా చేశారు.
ఇళ్ళు అంటే పేదవారి ఆత్మ గౌరవం..
ఆనాటి ప్రబుద్ధులకు ఇళ్ళు ఇవ్వాలనే జ్ఞానం లేదు..
గత ప్రభుత్వంలో ధనిక తెలంగాణా రాష్ట్రంలో 10 లక్షల ఇళ్లు కట్టాల్సి ఉంది
కేవలం కమీషన్ కోసం ధనిక తెలంగాణా రాష్ట్రంలో కాళేశ్వరం కట్టాడు కేసీఆర్
కాళేశ్వరం ఫౌండేషన్ వేసింది… ప్రారంభించింది వాళ్లే
వారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడే కాళేశ్వరం కూలి పోయింది..
ఎక్కడా అవినీతి జరగకుండా పేదవారికి ఇళ్లు ఇచ్చే విధంగా సంస్కరణలు తీసుకోచ్చాము
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాము
ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చేటప్పుడు ప్రతిపక్ష నాయకులు హేళనగా మాట్లాడారు.
రాష్ట్రంలో ఇన్ని లక్షల ఇళ్ళు కట్టిచ్చే అవకాశం ప్రజలు నాకు ఇచ్చారు..
ఈ జన్మకు ఇంతకంటే గొప్ప ఆనందం నాకు ఉండదు..
గడిచిన పది సంవత్సరాల్లో ఆనాటి ప్రబుద్ధులు ఇళ్లు ఇస్తామని ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ బొమ్మలు చూపించారు..
ఆనాటి పది సంవత్సరాల పాలనలో మాయమాటలు చెప్పి కాలయాపన చేశారు.
ప్రజా ప్రభుత్వం లో అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం.
మాటలు చెప్పి చెయ్యి ఇచ్చే ప్రభుత్వం కాదు ఇది…
దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా సన్నబియ్యం ఇస్తున్నాం
రాజకీయ ప్రమేయం లేకుండా….కమీషన్ లేకుండా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నాం..
రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి అర్హుడికి ఇల్లు… ఆర్థిక మద్దతు అందించడం ప్రభుత్వ లక్ష్యం..
- రైతుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు..
- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడి
- ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవెల్లి వీరభద్రరావు… 24 సభ్యుల ప్రమాణ స్వీకారం… 966 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు…. 19 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 19,02,204 రూపాయల చెక్కుల పంపిణీ

అశ్వరావుపేట డివిజన్లో కొత్తగా ఏర్పాటు అయిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ కమిటీ రైతు సంక్షేమానికి ముఖ్యమైన ఘట్టంగా రైతు సలహా కమిటీ చైర్మన్ … 24 మంది సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం, 966 ఇల్లు లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ, అలాగే కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద 19 లబ్ధిదారులకు 19, 02,204 చెక్కుల పంపిణీ కార్యక్రమం అశ్వారావుపేట లోని శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ , ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవెల్లి వీరభద్రరావు , 24 సభ్యులు నియామక పత్రాలు అందుకుని ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ …. రైతుల సంక్షేమం, పేదవర్గాల ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రతి పేదవాడికి నిజమవ్వాలని, రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి అర్హుడికి ఇల్లు, ఆర్థిక మద్దతు, భరోసా , భద్రత అందించడం ప్రధాన లక్ష్యం అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఇళ్ల నిర్మాణం, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 కే గ్యాస్, గత ప్రభత్వం ఇవ్వని రేషన్ కార్డులను ప్రజా ప్రభుత్వం ఏర్పడిన త్వరత సుమారు 11 లక్షల మందికి నూతన రేషన్ కార్డులు, సుమారు 7 లక్షల మంది పాత రేషన్ కార్డులలో పేర్ల నమోదు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు అయ్యాయని, ప్రతి పేదవాడికి హక్కులు, వసతులు సులభంగా అందించబడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ ఎటువంటి ఆర్భాటాలకు పోవటం ఏది చేయగలము ఏది చేయలేము అని అంచనాతో ప్రతి వర్గానికి చెబుతూ పేదవాడి గౌరవానికి భంగం కలగకుండా ఉండేవిధంగా పేదవాడు ఆత్మగౌరవంతో బతికే విధంగా పేదవాడికి పూర్తి మద్దతుగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని మంత్రి స్పష్టం చేశారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి పేదవారికి మంచి చేసే కార్యక్రమాన్ని ఈనాడు ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఇల్లు అనేది పేదవారి ఆత్మగౌరమని వారి భరోసా భద్రత కల్పించే విధంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవారికి అందిస్తున్నామని తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే ఈ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయడం నుండి ఫౌండేషన్ గృహప్రవేశాల వరకు విడతల వారీగా లబ్ధిదారునికి ఖాతాలో నేరుగా ప్రతి సోమవారం నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పేదవారు ఎక్కడా తలదించుకో కూడదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల పేదవారి అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు.
అనంతరం మంత్రి చేతుల మీదగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, గ్రంథాలయ చైర్మన్ వీరబాబు, హౌసింగ్ పిడి రవీంద్రనాథ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, రైతులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.