ఖమ్మం వార్తలు

తనకు జన్మను ,రాజకీయ జన్మను ఇచ్చిన వైరా అభివృద్ధి తన భాద్యత..డిప్యూటీ సీఎం భట్టి !

వైరా పట్టణంతో తనకు విడదీయరాని సంబంధం ఉంది తాను ఇక్కడే పుట్టి పెరిగి రాజకీయ జీవితం ప్రారంభించానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం వైరా పట్టణంలో వివిధ పార్టీల నుంచి 500 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రసంగించారు. వైరా పట్టణం అనాదిగా కాంగ్రెస్ కంచుకోట, పరిసర గ్రామాల్లో వివిధ పార్టీలు ఉన్నప్పటికీ వైరా పట్టణంలో మాత్రం కాంగ్రెస్ జెండాను నిటారుగా నిలబెట్టారని ఆ పార్టీ జెండాను రెపరెప లాడించారని డిప్యూటీ సీఎం గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కావాలని గత శాసనసభ ఎన్నికల్లో రాందాస్ నాయక్ ను గెలిపించి పంపించారు. మీ అంచనాల మేరకు కనీవిని ఎరగని రీతిలో ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు . సామాజిక పరివర్తన తీసుకువచ్చేందుకు ఐదు ఆరు మంది యువకులం కలిసి వైరా కేంద్రంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించామన్నారు. దుర్గాప్రసాద్, నాయుడు సత్యం, నూతి సత్యనారాయణ, పుల్లయ్య చౌదరిల తో కలిసి స్థానిక యువతను పోగేసి కాంగ్రెస్ జెండాను రెపరెప లాడించడం కోసం పెద్ద ఎత్తున పునాదులు నిర్మించాం అన్నారు. తాను ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా చీఫ్ విప్ గా ఉప సభాపతిగా రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సీఎల్పీ నేతగా ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం మీ అందరి ఆశీస్సులతోనే సాధ్యమైందని చెప్పడంలో తనకు ఎటువంటి సందేహం లేదని అన్నారు.

వైరా నియోజకవర్గ ప్రాంతం అంతా వ్యవసాయ రంగంపై ఆధారపడింది ఆనాడు తాము చేపట్టిన కార్యక్రమాలు తలుచుకుంటే అనేక ఆలోచనలు కలుగుతున్నాయి అన్నారు. పొలాలు ఎండిపోతుంటే భయము బెదురు లేకుండా సత్యాగ్రహం చేపట్టి వైరా చెరువు గేట్లను ఎత్తి పొలాలకు నీళ్లు పారించాం అన్నారు. ఈ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య బుద్ధులు నేర్పాలని ఆలోచనతో ప్రతి తరగతి గదులను విజిట్ చేశామని మన్నారు .స్వాతంత్ర సమరయోధుల గాధలు వృధాగా పోకూడదని ఆలోచనతో వారందరికీ సన్మానాలు చేసిన ఆనాటి కార్యక్రమాలను డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. నాడు రాజకీయ హింసను తట్టుకొని ఈ స్థాయికి చేరుకున్నామంటే ఈ ప్రాంత ప్రజల, నాయకుల ప్రోత్సాహం మరవలేనిది అన్నారు.
ఆరోజు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఏ ఒక్కరు కూడా వెనుకడుగు వేయలేదని దుర్గాప్రసాద్ వైరా సర్పంచ్ గా ఆ తర్వాత గ్రంధాలయ చైర్మన్ గా ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కోసం 42 పోలీసు కేసులు మీద వేసుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న నాయుడు సత్యం , నూతి సత్యనారాయణ ప్రస్తుతం పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు దొడ్డ పుల్లయ్య చౌదరి వైరా రిజర్వాయర్ చైర్మన్ గా ఉన్నారని వివరించారు. నిత్యం కృషి చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుంది అని చెప్పడానికి ఈ ఉదాహరణలు వివరించినట్టు తెలిపారు. దేశం రాష్ట్రం సౌఖ్యంగా ఉండాలంటే అన్ని వర్గాలు ప్రయోజనం పొందాలంటే కాంగ్రెస్ ద్వారానే సాధ్యం అన్నారు. నాడు జలగం వెంగళరావు శీలం సిద్ధారెడ్డి వారసులుగా బొర్రా భద్రయ్య ,బోసు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారని గుర్తు చేశారు . వైరా పట్టణం నలుమూలల పేదలకు ఇళ్లు ఉన్నాయి అంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే అన్నారు. గత పది సంవత్సరాలు అధికారం ఉన్న పార్టీలోకి కొద్ది మంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలిపోతే మిగిలిన నాయకులు పార్టీని వీడకుండా జెండా పట్టుకుని కొట్లాడంతో ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించింది అన్నారు. 10 సంవత్సరాలు కష్టపడి నిలబడి కొట్లాడిన ప్రతి కార్యకర్త నాయకుడిని కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంటుంది పాత కొత్త నాయకులను కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తాం అన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మహిళలకు ఉచిత బస్సు రవాణా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 96 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం ఎకరాకు 6000 చొప్పున తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా. గత 10 సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు గ్రూప్ వన్ గ్రూప్ టు ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అయ్యాయి అన్నారు. ధరణి పేరుతో వచ్చిన చట్టాన్ని బంగాళాఖాతంలో వేసి భూభారతిని తీసుకువచ్చాం, గత ప్రభుత్వ కాలంలో జీతాలు సకాలంలో పడక ప్రభుత్వ ఉద్యోగులు నెలవారి వాయిదాలు చెల్లించలేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటే తాము అధికారంలోకి రాగానే ప్రతినెలా ఒకటో తారీకు ఉన్నాయి జీతాలు చెల్లిస్తున్నాం అన్నారు.
బెస్ట్ అవైలబుల్ స్కీం కింద చెల్లించాల్సిన బకాయిలను గత ప్రభుత్వం చెల్లించకపోతే 25 వేల మంది విద్యార్థులకు సంబంధించిన బకాయిలను తమ ప్రభుత్వం ఒకేసారి క్లియర్ చేసింది అన్నారు.

మన బిడ్డలు ప్రపంచంతో పోటీపడేలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నాం అన్నారు. 25 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్లతో ఒక్కో పాఠశాల నిర్మిస్తున్నాం ఇందులో భాగంగా వైరా నియోజకవర్గానికి ఒక పాఠశాలను మంజూరు చేశాం త్వరలో భూమి పూజ చేస్తాం అన్నారు.
వైరా పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల, 100 పడకల ఆసుపత్రి, మూడు రోజుల క్రితం వైరా పట్టణ అభివృద్ధికి 15 కోట్లు కేటాయించాం అన్నారు.

వైరా పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంజూరు చేయాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కోరారు వాటిని పరిశీలించి మంజూరు చేయిస్తాం అన్నారు. స్థానిక యువతకు స్కిల్స్ నేర్పించడం కోసం ఐటిఐను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ గా మార్చాం. పాలిటెక్ కళాశాల మంజూరు చేసాం అన్నారు. వైరా ప్రాజెక్టు అద్భుతమైన టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్దబోతున్నాం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వైరా చెరువు మొదటి దశ కుడి ఎడమ కాలువ పనులను పూర్తి చేశాం పదేళ్ల తర్వాత తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలోని రెండవ దశ పనులకు మంజూరు చేశామన్నారు. రాజు లింక్ కెనాల్ కు 100 కోట్లు కేటాయించి వైరా చెరువులోకి గోదావరి నీళ్లు తీసుకువస్తున్నాం అన్నారు. వైరా , సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు గోదావరి జిల్లాలను మళ్లించేందుకు ఆర్థిక మంత్రిగా ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తున్న విషయాన్నీ గుర్తు చేశారు .

రెబ్బవరం నుంచి గన్నవరం వరకు 20 కోట్ల నిధులతో డబుల్ రోడ్డు పనులు మంజూరు చేసినట్టు వివరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం మళ్లీ ఈ పది సంవత్సరాల తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నాం అన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నాం ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున నిర్మిస్తున్నాం ఈ కార్యక్రమం ఆశామాషిదీ కాదు అన్నారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల మాదిరిగానే వైరా నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధికి నిరంతరం పనిచేస్తానని తెలిపారు. అందరూ ఐకమత్యంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి అని తాను ఎప్పుడూ అందుబాటులో అండగా ఉంటానని అన్నారు …

Related posts

తిర్మలాయపాలెం ప్రభుత్వ ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి అందుబాటులో లేని సిబ్బంది పై ఆగ్రహాం…

Ram Narayana

శివయ్య సన్నిధిలో డిప్యూటీ సీఎం భట్టి దంపతుల ప్రత్యేక పూజలు..

Ram Narayana

వరద బాధితులను ఆదుకోండి …సీఎం రేవంత్ కు సిపిఎం వినతి

Ram Narayana