తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మం జిల్లా మంత్రులపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు

ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ నూతన సర్పంచులు, ఉప సర్పంచుల అభినందన సభలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎండగట్టారు. పనిలో పనిగా జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కు , మంత్రులు పొంగులేటి , తుమ్మలపై తీవ్ర ఆరోపణలు చేశారు …

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో యూరియా కష్టాలు లేవు. ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే లైన్‌లలో చెప్పులు కనిపిస్తున్నాయి. షాపుల్లో లేని యూరియా యాప్‌లలో ఎలా వస్తుంది?

కాంగ్రెస్‌ పాలనలో ఎగవేతలు, కూల్చివేతలు. కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇచ్చారా? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చారా? రెండేళ్లలో ఏం అభివృద్ధి జరిగింది? కూల్చివేతలు, ఎగవేతలే కనిపిస్తున్నాయి. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం.

ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్‌ పని చేశారు. ఇప్పుడు ఇదే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. కనీసం రైతులకు యూరియా ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నారు. కమీషన్ల కోసమే ఆ ముగ్గురు పని చేసేది. 30 శాతం ట్యాక్స్ నడిపిస్తున్నారు వాళ్లు. ఆరు గ్యారెంటీలు భద్రంగా పెట్టుకోండని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆనాడు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇప్పుడు రెండేళ్లు అయినా గ్యారెంటీలు అమలు కాలేదు. దీనికి భట్టి ఏమి సమాధానం చెబుతారు? అని కేటీఆర్ గారు అన్నారు.

మంత్రులు పొంగులేటి,తుమ్మలపై కేటీఆర్ కామెంట్స్…

మంత్రి పొంగులేటి దీపావళికి బాంబులు పేలుతాయని అన్నాడు.. రెండు దీపావళిలు పోయాయి కానీ బాంబులు మాత్రం పేలలేదు..

ఆయన ఇంటి మీద ఈడీ రైడ్స్ అయితే మోదీ, అదానీ కాళ్ళు పట్టుకొని కేసు అవ్వకుండా బీజేపీకి మోకరిల్లాడు..

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అహంకారంపై చావుదెబ్బ కొట్టి గెలిచిన ఆర్మీ రవి!

కాంగ్రెస్ మంత్రి పొంగులేటి అరాచకాలు, పోలీసుల వేధింపులు భరించలేక ఒకానొక దశలో ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్మీ రవి.. నేడు సర్పంచ్‌గా గెలిచి అదే పొంగులేటి అహంకారాన్ని మట్టికరిపించారు.

ఇది ఒక్క రవి విజయం మాత్రమే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ దమనకాండను ఎదిరించి, ప్రజాస్వామ్యబద్ధంగా విజయం సాధించిన ఎందరో పోరాట యోధుల గెలుపు!

ఇంకో మంత్రి తుమ్మల…నేను వస్తున్నా అని కార్పొరేటర్ల ఇండ్లు తిరిగి ముగ్గురిని పట్టుకొని రేవంత్ రెడ్డి ఇంటికి పోయాడు..

ప్రజలు అనుకుంటే ఎంతమంది కార్పొరేటర్లను ఎత్తుకొని పోయినా తుమ్మల పీకేది ఏం ఉండదు.. ఎంతమంది కార్పొరేటర్లు పోయినా, యువతకు అవకాశం ఇచ్చి కొత్త నాయకులను తయారు చేస్తాం..

ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్లు దిండిగల రాజేందర్, ఖమర్, మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అప్పుడు కేసీఆర్ చేసింది కరెక్ట్ అయితే.. ఇప్పుడు మాది కరెక్టే: పొన్నం ప్రభాకర్

Ram Narayana

ఇంట గెలిచి రచ్చ గెలవాలి..రేవంత్ రెడ్డి

Ram Narayana

తెలంగాణాలో ఇంటి ఇంటికి కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్…ఖమ్మం జిల్లాకు ప్రియాంక గాంధీ..!

Ram Narayana