తెలంగాణ వార్తలు

మున్సిపోల్స్ డేట్ ఫిక్స్?…రేపు షెడ్యూల్!

తెలంగాణలో మరో ఎన్నికలసమరానికి ముహూర్తం ఫిక్స్ అయింది. రాష్ట్రంలోని ఏడు నగరపాలక సంస్యలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు తుది కసరత్తు జరుగుతోంది. ఈ నెల 27న షెడ్యూల్ విడుదలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అదే రోజు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సమావేశం నిర్వహిస్తారు. తుది ఏర్పాట్లపై సమీక్షించి షెడ్యూల్ ప్రకటించనున్నట్లు సమాచారం, ఫిబ్రవరి 15లోగా ఎన్నికల పూర్తికి ఎన్నికల సంఘం వేగం పెంచింది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి . ఇప్పటికే సీఎం రేవంత్ మంత్రులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. దీంతో మంత్రులు ఎమ్మెల్యేలు పరుగులు పెడుతున్నారు .. అటు బీఆర్ యస్ .. బీజేపీలు తమ వ్యూహాలతో సిద్ధం అవుతున్నాయి. దీంతో.. రాజకీయం నువ్వా? నేనా? అన్నట్లుగా మారింది. మున్సిపాలిటీల్లో 2,996 వార్డుల పరిధిలో 52,42,954 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళలు 26,80,014 మంది ఉండగా. 25,62,300 మంది పురుషులు, 640 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలవారీగా ఓటర్ల జాబితాను అధికారులు ఇప్పటికి ప్రచురించారు. రాజకీయంగా ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్తో పాటుచీఆర్ఎస్, బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. సీఎం రేవంత్ జిల్లాల పర్యటనలకు ప్లాన్ చేస్తున్నారు. అధికారపక్షం మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. ప్రతిపక్ష నేతలపై విమర్శల వేడి పెంచుతున్నారు.

ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా కార్పొరేషన్, మున్సిపల్ ఎన్ని కలపై ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించింది. దీనికోసం కేటీఆర్ కూడా వరస పర్యటనలకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు జిల్లాల్లో పార్టీ కేడర్ తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు. ఇక.. 27న ఎన్నికల షెడ్యూల్ విడుదల తరువాత ఎన్నికల ప్రచారం పూర్తి స్థాయిలో మొదలయ్యే అవకాశం ఉంది.

వార్డుకు 5 లేదా ఆరుగురు అభ్యర్థులు…

అభ్యర్ధుల గుర్తింపు బాధ్యతలని అప్పగించడంతో క్షేత్రస్థాయిలో అధ్యయనం ప్రారంభించారు. ప్రతి వార్డుకు 5 నుంచి 6 గురు అభ్యర్థులను ఎంపిక చేయాలని పీసీసీ సూచించింది. పార్టీలో కొత్త, పాత నేతల మధ్య సమన్వయం కుదర్చడమే పెద్ద సవాలుగా మారింది .సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రెవిన్యూ శాఖ మంత్రి పాలగులేటి శ్రీనివాసరెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ… రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికలను రెఫరెండంగా భావిస్తున్నట్లు తెలిపాడు.

ప్రజలను ఓట్లడిగే హక్కు ఒక్క కాంగ్రెస్ కే ఉండని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో చేయని అభివృద్ధిని 2 సంవత్సరాల్లోనే నిరూపించామని అన్నారు. కే సముద్రం, మహబూబాబాద్ మున్సిపాలిటీలలో రూ.170 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మంత్రులు సీతక్కు వాకిటి శ్రీహరి తో కలిసి కలిసి మంత్రి పొన్నం శంకుస్థాపన చేశారు.

పురపాలక ఎన్నికల కోసం బీఆర్ఎస్ ఇన్చార్డులను నియమించింది. అధికార కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలనే వ్యూహంతో పావులు కదుపుతుంది ..అందుకు అనుగుణంగా స్థానికంగా కలిసి వచ్చే శక్తులను ,వ్యక్తులను కలుపుకోవాలని అడుగులు వేస్తుంది …ఇప్పటికే కొన్ని చోట్ల ,లెఫ్ట్ పార్టీలతో చర్చలు జరుపుతుంది … ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లు. మున్సిపాల్టీల వారీగా సమన్వయ కర్తల జాబితాను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్ కి సీనియర్ నాయకుడికి ఇన్ చార్జీ గా బాధ్యతలు అప్పగించారు. ప్రజల మద్దతుతో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కేటీఆర్ కోరారు.

Related posts

నిజామాబాద్ లో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్..!

Ram Narayana

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ అరెస్ట్… తీవ్రంగా స్పందించిన కేటీఆర్

Ram Narayana

ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం

Ram Narayana