సిట్ పేరుతో కేసీఆర్ ను విచారించడం రాజకీయ ప్రతీకార చర్యే …మాజీమంత్రి పువ్వాడ
తెలంగాణ సాధకుని ,ఉద్యమకారుణ్ణి అవమానపరిచేలా ప్రభుత్వం వ్యవహారం
ఖమ్మం , వైరా నందు నిరసన ర్యాలీ ధర్నా చేపట్టిన మాజీ మంత్రి పువ్వాడ..
ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం అధికారులకు సంబందించిన అంశం
రేవంత్ సర్కార్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని సిట్ విచారణకు పిలవడం చట్ట విరుద్ధమేగాక ,రాజకీయ ప్రతీకార చర్య అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రేవంత్ రెడ్డి సర్కార్ పై ధ్వజమెత్తారు . సిట్ విచారణకు వ్యతిరేకంగా ఆదివారం జిల్లా కేంద్రమైన ఖమ్మం లోను , వైరాలు బీఆర్ యస్ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు . చట్ట ప్రకారం 65ఏళ్ళు నిండిన వ్యక్తిని విచారించాలంటే ఆ వ్యక్తి ఉన్నా చోటనే విచారణ చేపట్టాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా కాకుండా విచారణ పేరుతో నోటీసులు జారిచేసి ఒక మహానాయకున్ని చిన్న బుచ్చాలని చూస్తుందని పువ్వాడ విమర్శించారు . దీనికి రేవంత్ రెడ్డి సర్కార్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ..
తప్పుడు కేసులు పెట్టి వేదించాలని చూసిన కేసీఆర్ విచారణకు సహకరిస్తానని చెప్పడం ఆయన గొప్ప మానవత్వానికి నిదర్శనం.ఫోటో టాపింగ్ అనేది పోలీస్ అధికారులకు మాత్రమే సంబందించినది అంతే కానీ ఏ ముఖ్యమంత్రి కు మంత్రులకు సంబంధం ఉండదని అన్నారు .ఇలాంటి తప్పుడు కేసులు పసలేని కేసులు ఆనాడు కేసీఆర్ ఉద్యమ సమయంలోనే ఎదుర్కొన్న విషయాన్నీ ఆయన గుర్తు చేశారు ..
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన నాయకుడిని రాజకీయ కక్షతో విచారణ పేరుతో వేధించడం తగదని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలు,ఉద్యమాల త్యాగాలతో సాధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ సిట్ విచారణ చేపట్టారని విమర్శించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్యగా ఆయన అభివర్ణించారు. అక్రమ కేసులకు బయపడకుండా మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి,నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు,కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ,నాగండ్ల కోటేశ్వరరావు,కూరాకుల వలరాజు,జ్యోతి రెడ్డి,తోట రామారావు,బిక్కసాని జస్వంత్, బుడిగం శ్రీను,మాటేటి నాగేశ్వరరావు,బుర్రి వెంకట్, పసుమర్తి రామ్మోహన్,ముక్కాల రాజేష్,మాజీ సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్రా రెడ్డి,మాజీ గ్రంధాలయం చైర్మన్ ఖమర్,జిల్లా మైనారిటీ అధ్యక్షులు తాజుద్దీన్,గిరిబాబు,మంజుల, లీగల్ సెల్ కొత్త వెంకటేశ్వరావు,
తిరుమలరావు,సుగుణరావు,కార్మిక విభాగం పాషా,షకీనా,మాధవి,మాటేటి కిరణ్,అశోక్,
రాంబాబు,వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.