- లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్, సిసోడియాలకు ఊరట
- నిందితులపై తగిన ఆధారాలు లేవని తేల్చిన రౌస్ అవెన్యూ కోర్టు
- తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించిన సీబీఐ
- నిర్దోషిగా తేలడంతో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న కేజ్రీవాల్
- ఇది మోదీ, అమిత్ షాల రాజకీయ కుట్రేనని కేజ్రీవాల్ ఆరోపణ
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో వారిపై మోపిన అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే, ఈ తీర్పు వెలువడిన కొద్దిసేపటికే, దీనిని హైకోర్టులో సవాలు చేయనున్నట్లు సీబీఐ స్పష్టం చేసింది.
కేసు విచారణలో నిందితులపై నేరారోపణలు రుజువు చేసేందుకు తగిన ఆధారాలు లభించలేదని కోర్టు తన తీర్పులో పేర్కొంది. క్రిమినల్ కుట్ర సహా ఎలాంటి నేరపూరిత చర్యలు జరిగినట్లు ఆధారాలు లేవని తేల్చిచెబుతూ, నిందితుల డిశ్చార్జ్ పిటిషన్‌ను న్యాయస్థానం అనుమతించింది.
కోర్టు తీర్పు అనంతరం కేజ్రీవాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సిసోడియా ఆయనను ఓదార్చారు. “సత్యమే గెలుస్తుందని, న్యాయవ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉందని ఎప్పుడూ చెబుతున్నాం. ఆ నమ్మకమే ఈ రోజు నిజమైంది” అని కేజ్రీవాల్ అన్నారు. ఆప్‌ను బలహీనపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ రాజకీయ కుట్ర పన్నారని, ఇది పూర్తిగా బూటకపు కేసు అని ఆయన ఆరోపించారు.
మరోవైపు, ట్రయల్ కోర్టు తమ విచారణలోని అనేక కీలక అంశాలను విస్మరించిందని లేదా సరిగా పరిగణనలోకి తీసుకోలేదని సీబీఐ వాదిస్తోంది. అందుకే ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు తెలిపింది. 2021-22 ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగాయని, లైసెన్సులకు అనుకూలంగా ‘సౌత్ గ్రూప్’ నుంచి ఆప్ నేతలు ముడుపులు స్వీకరించారని ఆరోపిస్తూ 2022లో సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించండి… మోదీకి సవాల్ విసిరిన కేజ్రీవాల
- లిక్కర్ కేసులో క్లీన్‌చిట్ తర్వాత కేజ్రీవాల్ తొలి ప్రెస్ మీట్
- ఆప్‍ను నాశనం చేసేందుకు మోదీ, షా కుట్ర పన్నారని ఆరోపణ
- దమ్ముంటే ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి సవాల్
- తప్పుడు కేసు పెట్టినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
- ఈడీ కేసును కూడా ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని వెల్లడి
https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-9438635584329477&output=html&h=360&adk=686310250&adf=2046310082&pi=t.aa~a.3131001919~rp.1&w=360&lmt=1772208700&rafmt=1&to=qs&pwprc=3109334599&format=360×360&url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F858436%2Farvind-kejriwal-challenges-modi-to-hold-elections-now&fwr=1&pra=3&rpe=1&resp_fmts=3&sfro=1&aieuf=1&aicrs=1&fa=40&uach=WyJBbmRyb2lkIiwiMTUuMC4wIiwiIiwiQ1BIMjc4MSIsIjE0NS4wLjc2MzIuMTIwIixudWxsLDEsbnVsbCwiIixbWyJOb3Q6QS1CcmFuZCIsIjk5LjAuMC4wIl0sWyJHb29nbGUgQ2hyb21lIiwiMTQ1LjAuNzYzMi4xMjAiXSxbIkNocm9taXVtIiwiMTQ1LjAuNzYzMi4xMjAiXV0sMF0.&abgtt=6&dt=1772209144523&bpp=5&bdt=105&idt=88&shv=r20260225&mjsv=m202602240101&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D166c702d7acc66fb%3AT%3D1767378401%3ART%3D1772208958%3AS%3DALNI_MZu8fwt3PjPf-F4lKvdE_LaT_9FqQ&gpic=UID%3D000011daae11e4e0%3AT%3D1767378401%3ART%3D1772208958%3AS%3DALNI_MbLgeCV8VaLO8dAU4kNqcvW48ppKw&eo_id_str=ID%3D6d16f3e4b9ddf564%3AT%3D1767378401%3ART%3D1772208958%3AS%3DAA-AfjYn9dVxZi45NH6TsYyCR7a7&prev_fmts=0x0&nras=2&correlator=6170676784893&frm=20&pv=1&u_tz=330&u_his=35&u_h=791&u_w=360&u_ah=791&u_aw=360&u_cd=24&u_sd=3&dmc=8&adx=0&ady=1067&biw=360&bih=750&scr_x=0&scr_y=0&eid=31096982%2C42532523%2C95366176%2C95378425%2C95381339%2C95382853%2C95383860%2C31096910%2C95382195&oid=2&pvsid=7858012895622018&tmod=1916903138&uas=1&nvt=1&ref=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftelugu-news&fc=1920&brdim=0%2C0%2C0%2C0%2C360%2C0%2C360%2C791%2C360%2C750&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=128&bc=31&bz=1&bisch=0&blev=0.51&ifi=2&uci=a!2&btvi=1&fsb=1&dtd=95
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో క్లీన్‌చిట్ లభించిన అనంతరం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని నాశనం చేసేందుకే కుట్ర పన్నారని ఆరోపించారు. దమ్ముంటే ఢిల్లీలో వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని కేంద్రానికి సవాల్ విసిరారు.
మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ వంటి సీనియర్ నేతలతో కలిసి పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పుడు కేసులో తనను, ఆప్ నేతలను ఇరికించినందుకు మోదీ, షా ద్వయం ఢిల్లీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదొక తప్పుడు, కల్పిత, పూర్తిగా నిరాధారమైన కేసని, అందుకే న్యాయవిచారణలో నిలవలేకపోయిందని అన్నారు.
ఈ కేసులో విచారణ ప్రారంభించడానికి తగిన ఆధారాలు లేవని రౌస్ అవెన్యూ కోర్టు 600 పేజీల తీర్పులో స్పష్టం చేసిందని కేజ్రీవాల్ గుర్తుచేశారు. సీబీఐ కేసును కోర్టు కొట్టేసిన నేపథ్యంలో, ఈడీ కేసు కూడా నిలబడదని, త్వరలోనే దానిని ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని తెలిపారు. ఈ తీర్పుతో తాను, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ వంటి ఆప్ నేతలు ‘కట్టర్ ఇమాన్‌దార్’ (అత్యంత నిజాయతీపరులు) అని మరోసారి రుజువైందని అన్నారు.
“ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలే ఈ కుట్రకు సూత్రధారులు. మమ్మల్ని అధికారం నుంచి దించేందుకే నాలుగేళ్లుగా సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలను వాడుకుని వేధించారు” అని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే, బీజేపీకి 10 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రాలపై కేసులు ఉన్నా ఎందుకు జైలుకు వెళ్లడం లేదని, కాంగ్రెస్ ఆరోపణలపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు