తెలుగు రాష్ట్రాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అయితే తెలంగాణ అసెంబ్లీ లో 40 సీట్లు

నియోజవర్గాల పునర్విభజనపై కేంద్ర కసరత్తు ప్రారంభించిందన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విభజన హామీ చట్టాన్ని ఏమి చేస్తారు పక్కన పెడతారా లేక అమలు చేస్తారా ..?అనే సందేహాలు నెలకొన్నాయి.. తెలంగాణాలో ప్రస్తుతం ఉన్న 119 సీట్లను 153 కు పెంచాలని , ఏపీలో 175 నుంచి 225 పెంచుతామని విభజన చట్టంలో స్పష్టం చేశారు ..కానీ అది ఇంతవరకు నోచుకోలేదు …దీనిపై కేంద్రాన్ని అంటూ ఏపీ , ఇటు తెలంగాణ ప్రభుత్వాలు వత్తడి తెస్తున్నప్పటికీ కేంద్రం నుంచి పెద్దగా స్పందన లేదు…ఇప్పుడు దేశవ్యాపితంగా నియోజకవర్గాల డీలిమిటేషన్ వ్యవహారం ముందుకు వచ్చింది …జనాభా ప్రాతిపదికన జరుగుతుందని అది కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తారని సమాచారం …అదే జరిగితే మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని విభజన చట్టం సంగతి ఏమిటని ప్రశ్న ఉద్బవిస్తుంది ..మహిళలకు చట్ట సభల్లో 33% రిజర్వేషన్లు అమలు జరపాలని కేంద్రం గట్టి పట్టుదలతో ఉంది ..అదే జరిగితే మహిళలకు రాజకీయాల్లో మంచి అవకాశాలు వస్తాయి…

జనాభా లెక్కలు, డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం నిర్ణయిం చింది. ఈ మేరకు కేంద్రం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణతో మహిళా నాయకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షా లకు సమాచారం ఇవ్వగా… ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే కేంద్ర కేబినెట్ దీనికి సంబందించిన ప్రతిపాదనలను ఆమోదించనుంది. ఆ తర్వాత లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం పొందేలా ప్రయత్నాలు చేస్తున్నది.

రాష్ట్రంలో మహిళలకు 40 సీట్లు పెరిగే అవకాశం

మహిళా బిల్లు అమలును 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ తో ముడిపెడుతూ రాజ్యాంగంలోని 106వ సవరణలో పొందుపర్చారు. దీంతో చట్టసభల్లో మూడో వంతు సీట్లు మహిళలకు కేటాయిస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 2011 జనాభా లెక్కల ప్రకారం లేదా లాటరీ విధానంలో అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 3వ వంతు సీట్లు కేటాయించాలని తాజాగా ప్రతిపాదిస్తున్నారు. ఈ విధానం ద్వారా సీట్ల కేటాయింపు సులభమవుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం తెలంగాణ లోని 119 సీట్లలో మూడో వంతు అంటే 40 సీట్లు మహిళలకు కేటాయించడం తప్పనిసరి కానుంది. ఇందులోనూ ఎస్సీ, ఎస్టీ మహిళలకు పోను, మిగిలిన సీట్లను జనరల్ మహిళలకు కేటాయిస్తారు. దీంతో పాటే శాసనమండలిలోనూ 3వ వంతు అనగా 13 సీట్లు వారికి రిజర్వ్ కానున్నాయి.

మహిళా నేతల్లో కొత్త ఆశలు

కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు అడుగులు వేస్తుండ టంతో మహిళా నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి. వచ్చే ఎన్నికల్లో 3వ వంతు సీట్లు మహిళలకు ఇవ్వాల్సి వస్తే తమకు కూడా అవకాశం దక్కుతుందని వారు లెక్కలు వేసుకుంటున్నారు. నాయకుల భార్యలు, బిడ్డలు, తల్లులు, వారి కుటుంబ సభ్యులకు కాకుండా.. స్వయంగా ప్రజల్లో, రాజకీయాల్లో తిరిగే వారికి అవకాశం ఇవ్వాలని పార్టీలను కోరుతున్నారు. ఇన్నాళ్లుగా కష్టపడ్డ తమకు పోటీ చేసే చాన్స్ ఇవ్వడం ద్వారా గుర్తింపు లభిస్తుందని చెబుతున్నారు. జిల్లాలు, సామాజికవర్గాల వారీగా మహిళా నేతలు ఇప్పటికే లెక్కలు వేసుకుంటూ తమకే అవకాశం దక్కుతుందని అంచనా వేసుకుంటూ సంతోషం వ్యక్తంచేస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకోసం ఇప్పటి నుంచే ఆర్థికంగా సన్నద్ధమవ్వడమే కాకుండా.. కీలక నేతల ఆశీర్వాదం కోసం ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నారు.

డీలిమిటేషన్ పూర్తయితే మరిన్ని స్థానాలు..

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో డీలిమిటేషన్ తో సంబంధం లేకుండానే రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు తెలుస్తున్నది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2029లో జరగనున్నందున… అప్పటికే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో అప్పటివరకు ఎంపీ, ఎమ్మెల్యేల సీట్ల సంఖ్య కూడా పెరగనుంది. తద్వారా మహిళలకు మరిన్ని సీట్లు రిజర్వ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. తెలం గాణలో డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్ల ప్రకారం 50 సీట్లకు పైగా అతివలకు కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అయితే దీంతో సంబంధం లేకుండా రాష్ట్ర విభనచట్టంలో తెలంగాణాలో సెట్ల సంఖ్య 119 నుంచి 153 వరకు , ఆంధ్రప్రదేశ్ లో 175 గా ఉన్న సీట్లను 225 వరకు పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి..అయితే దేశవ్యాపితంగా పునర్విభజన జరిగితే విభజన చట్టాన్ని పక్కన పెడతారా …?అనే సందేహాలు లేకపోలేదు.. దేశ వ్యాపితంగా జరిగే పునర్విభజనలో జనాభా ప్రాతిపదికన అంటే దక్షణాది రాష్ట్రాలు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

Related posts

నీటి వాడకం విషయంలో చంద్రబాబు కు సూచన చేసిన సీఎం రేవంత్ రెడ్డి …

Ram Narayana

‘హైడ్రా’ మంచిదే.. రేవంత్‌పై వెంకయ్యనాయుడి ప్రశంసలు!

Ram Narayana

హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నందమూరి బాలకృష్ణ…

Ram Narayana