జాతీయ వార్తలు

గ్యాస్, చమురు నిల్వలు ఎంత ఉన్నాయో చెప్పండి: ఇంధన సంస్థలకు కేంద్రం ఆదేశాలు…

దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీల వద్ద ఉన్న నిల్వలు, ఉత్పత్తి, వినియోగం, దిగుమతులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఆందోళన నెలకొంది. 

దేశంలో ఇంధన, గ్యాస్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్, సహజవాయువు సరఫరా గొలుసును పర్యవేక్షించేందుకు ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా కంపెనీలు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ)కు ఈ వివరాలు అందించాలని సూచించింది.

Related posts

కాలుస్తావా? ఎక్కడికి రావాలో చెప్పు?…రిటైర్డ్ ఐపీఎస్ కు బజరంగ్ పునియా సవాల్!

Drukpadam

రాజస్థాన్ ముఖ్యమంత్రికి హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే..!

Ram Narayana

పనిమనిషిపై ఎమ్మెల్యే కొడుకు, కోడలు వేధింపులు… పరారీలో నిందితులు

Ram Narayana