ఆంధ్రప్రదేశ్ప్రమాదాలు ...

మార్కాపురంలో ఘోర ప్రమాదం .. 14 మంది సజీవదహనం

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 14 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు సుమారు 40 మంది ప్రయాణికులతో ఒక ప్రైవేట్ బస్సు బయలుదేరింది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని క్వారీల వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు డీజిల్ ట్యాంక్ పగిలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల్లో బస్సు, టిప్పర్ రెండూ చిక్కుకున్నాయి.

ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే, 10 మంది మాత్రం మంటల్లో చిక్కుకుని బయటకు రాలేక సజీవ దహనమయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో 4 గురు చికిత్స పొందుతూ మరణించారు . మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మృతుల కుటుంబాలకు వైసీపీ లక్ష చొప్పున సహాయం

మార్కాపురం వద్ద జరిగిన రోడ్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు వైసీపీ లక్ష చొప్పున సహాయం ఆర్థిక సహాయం అందిస్తానామం వైపీసీ నియోజకవర్గ ఇంచార్జి ప్రసాద రెడ్డి ప్రకటించారు . గతంలో కర్నూల్ వద్ద జరిగిన ప్రమాద వార్త మరిచి పోక ముందే మార్కాపురం వద్ద బస్సు ప్రమాదం జరగడం దారుణమని వైసీపీ నాయకులు అన్నారు . బస్సు ప్రమాదాల జరగకుండా వాటి ప్రమాణాలు సరిగా పారించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు …

మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భాంతి .. కీలక ఆదేశాల జారీ

Chandrababu Naidu Expresses Grief Over Markapuram Bus Accident Issues Orders

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈరోజు తెల్లవారుజామున రాయవరం గ్రామ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఘటన తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులకు సూచించారు.

Related posts

తుళ్లూరు పోలీసుల‌ కస్టడీకి జర్నలిస్ట్ కృష్ణంరాజు .. మూడు రోజుల విచారణ

Ram Narayana

డిసెంబర్ 1 ,5 తేదీల్లో గుజరాత్ ఎన్నికలు…

Drukpadam

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు వైద్య విద్యార్థులు సహా ఆరుగురు దుర్మరణం!

Ram Narayana