వాళ్ల డబ్బులు వాళ్లకు ఇవ్వడానికి ఎందుకింత నిర్లక్ష్యం..రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ పై రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడానికి ఎందుకు నిర్లక్ష్యం అని రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది ..వారికీ ఇవ్వాల్సిన డబ్బులు అన్ని జూన్ 10 వ తేదీనాటికి ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది ..ఆ తేదీ తర్వాత ఒక్క ఉద్యోగి కూడా బెనిఫిట్స్ రాలేదని చెప్పకూడని కూడా తీర్పులు స్పష్టం చేసింది రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విషయంలో ఆర్థిక శాఖపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ..
కాంగ్రెస్ ప్రభుత్వం తమ బెనిఫిట్స్ ఇవ్వడంలేదని, రిటైర్డ్ ఉద్యోగులు వేసిన 754 పిటిషన్ల పట్ల విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది …ఒక్కో పిటీషన్లో దాదాపు ఒకటి నుండి 10 మంది పిటిషనర్లు ఉన్నారని, ఒక్కో పిటీషన్లో ఎంత మందికి బెనిఫిట్స్ ఇచ్చారో పూర్తి నివేదిక అందజేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు..
రిటైర్డ్ ఉద్యోగులు చాలా సున్నితంగా ఉంటారని, వారి జీవితాలతో చెలగాటం ఆడొద్దని ఆర్థిక శాఖకు హైకోర్టు హెచ్చరించింది …జూన్ 10వ తేదీకి కేసు వాయిదా వేస్తూ, ఆ లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని, తదుపరి విచారణలోగా ఒక్క పిటిషనర్ కూడా బెనిఫిట్స్ రాలేదని చెప్పకూడదని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది …