అంతర్జాతీయం

అమెరికాలో వీసా ఫ్రాడ్ కేసు… ఇద్దరు భారత సంతతి వ్యక్తులు దోషులుగా నిర్ధారణ…

  • అమెరికాలో హెచ్-1బీ వీసా మోసానికి పాల్పడిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులు
  • నేరాన్ని అంగీకరించిన సంపత్ రాజిడి, శ్రీధర్ మాద అనే వ్యక్తులు
  • యూనివర్సిటీలో లేని ఉద్యోగాలను సృష్టించి వీసాలు పొందినట్లు నిర్ధారణ
  • దోషులకు ఐదేళ్ల జైలు, 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం 

అమెరికాలో హెచ్-1బీ వీసాల పేరిట భారీ మోసానికి పాల్పడిన కేసులో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించారు. కాలిఫోర్నియాలోని ఓ యూనివర్సిటీలో ఉనికిలో లేని ఉద్యోగాలను సృష్టించి, తద్వారా వీసాలు పొంది మోసం చేసినట్లు వారు అంగీకరించారని అమెరికా అటార్నీ కార్యాలయం ప్రకటించింది.

వివరాల్లోకి వెళితే, కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగర నివాసులైన సంపత్ రాజిడి (51), శ్రీధర్ మాద (51) ఈ కుట్రకు పాల్పడ్డారు. శ్రీధర్ మాద, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ (UCANR) విభాగానికి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా తన పదవిని దుర్వినియోగం చేశారు. హెచ్-1బీ వర్కర్లను నియమించుకునే అధికారం లేకపోయినా, యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. మరోవైపు, సంపత్ రాజిడి తన వీసా సర్వీసింగ్ కంపెనీలైన ఎస్-టీమ్ సాఫ్ట్‌ వేర్ ఇంక్, అప్‌ట్రెండ్ టెక్నాలజీస్ ఎల్ఎల్‌సీ ద్వారా ఈ మోసపూరిత దరఖాస్తులను దాఖలు చేశారు.

జూన్ 2020 నుంచి జనవరి 2023 మధ్య ఈ మోసం కొనసాగింది. అనేక మంది పేరుమీద వీరిద్దరు హెచ్ 1 బీ వీసా పిటిషన్లు దాఖలు చేశారు. కూట్రలో భాగంగానే ఇలా చేసినట్లు దర్యాప్తులో తేలడంతో పాటు నిందితులు కూడా నేరాన్ని అంగీకరించినట్లు కాలిఫోర్నియా అటార్నీ కార్యాలయం తెలిపింది. ఈ కేసులో దోషులకు గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 2,50 లక్షల డాలర్ల భారీ జరిమానా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.  

Related posts

ప్ర‌పంచంలోని అతిపెద్ద‌ క్రిమిన‌ల్‌ను మోదీ ఆలింగనం చేసుకోవ‌డం చాలా నిరాశను కలిగించింది: ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ

Ram Narayana

భారత్‌కు వచ్చిన తాలిబన్ మంత్రి… అధికారులకు విచిత్రమైన తలనొప్పి!

Ram Narayana

ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ?

Ram Narayana