అంతర్జాతీయం

ట్రంప్ కాల్పుల విరమణను తిప్పికొట్టిన ఇరాన్.. ఓడిపోయిన వారు షరతులు పెట్టలేరని వ్యాఖ్య

Donald Trump Iran ceasefire rejected Iran says losers cant set terms
  • ఇరాన్‌తో కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగించిన ట్రంప్
  • ట్రంప్ నిర్ణయాన్ని ఎద్దేవా చేసిన ఇరాన్ ఉన్నత సలహాదారు
  • దిగ్బంధనం కూడా దాడితో సమానమని.. సైనిక చర్య తప్పదని హెచ్చరిక
  • ఇరు దేశాల మధ్య జరగాల్సిన శాంతి చర్చలపై నీలినీడలు

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. శాంతి చర్చల కోసం ఇరాన్‌తో కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ఈ ప్రతిపాదనను ఇరాన్ తీవ్రంగా తిరస్కరించింది. ట్రంప్ నిర్ణయం అర్థరహితమని, ఓడిపోయిన పక్షం షరతులు విధించలేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘేర్ ఘలీబాఫ్ సీనియర్ సలహాదారు మహదీ మొహమ్మదీ ఎద్దేవా చేశారు.

పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలకు మరింత సమయం ఇచ్చేందుకే కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్‌ఫామ్‌లో పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇరాన్ నాయకత్వంలో తీవ్రమైన భేదాభిప్రాయాలు ఉన్నాయని, ఒక ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు వచ్చేందుకు వారికి సమయం ఇస్తున్నామని అన్నారు. అయితే, హ‌ర్మూజ్ జలసంధిలోని ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. 

ట్రంప్ ప్రకటనపై మహదీ మొహమ్మదీ తీవ్రంగా స్పందించారు. “ట్రంప్ కాల్పుల విరమణ పొడిగింపునకు అర్థం లేదు. ఓడిపోయిన పక్షం షరతులు పెట్టలేదు. దిగ్బంధనాన్ని కొనసాగించడం కూడా బాంబు దాడులతో సమానం. దీనికి సైనిక చర్యతోనే బదులివ్వాలి. ఆకస్మిక దాడికి పాల్పడేందుకు సమయం సంపాదించే కుట్రలో భాగమే ఈ కాల్పుల విరమణ. ఇక ఇరాన్ చొరవ తీసుకునే సమయం ఆసన్నమైంది” అని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా హెచ్చరించారు.

మరోవైపు ఇరాన్ ఆర్థికంగా కుప్పకూలుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. “వారు వెంటనే హ‌ర్మూజ్ జలసంధిని తెరవాలని కోరుకుంటున్నారు. నగదు కోసం ఆకలితో ఉన్నారు. రోజుకు 500 మిలియన్ డాలర్లు నష్టపోతున్నారు. సైన్యం, పోలీసులకు జీతాలు అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి” అని ట్రంప్ పేర్కొన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రెండో విడత శాంతి చర్చల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇరాన్ నుంచి ప్రతిపాదన వచ్చే వరకు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్‌కు వెళ్లరని వైట్‌హౌస్ అధికారి ఒకరు వెల్ల‌డించారు. దీంతో ఇరు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

  • ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించిన ట్రంప్
  • అయితే పోర్టుల దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టీక‌ర‌ణ‌
  • పాకిస్థాన్ నేతల అభ్యర్థన మేరకే ఈ నిర్ణయమన్న అమెరికా అధ్యక్షుడు
  • ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు ఉన్నాయని వ్యాఖ్య
  • పాకిస్థాన్‌లో జరగాల్సిన శాంతి చర్చలకు వైస్ ప్రెసిడెంట్ దూరం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ విషయంలో కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అదే సమయంలో ఇరాన్ పోర్టులపై అమెరికా నౌకాదళ దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. చర్చలకు మరింత సమయం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అభ్యర్థన మేరకు ఇరాన్‌పై దాడిని వాయిదా వేసినట్లు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో వెల్లడించారు. “ఇరాన్ ప్రభుత్వంలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. వారు ఒక ఏకాభిప్రాయంతో ప్రతిపాదనతో ముందుకు వచ్చే వరకు సమయం ఇవ్వాలని పాక్ నేతలు కోరారు” అని ట్రంప్ పేర్కొన్నారు.

గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ ఈ కాల్పుల విరమణ పొడిగింపు నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే, ఇరాన్‌లోని హ‌ర్మూజ్ జలసంధి వద్ద ఉన్న పోర్టులపై దిగ్బంధం కొనసాగుతుందని, అమెరికా సైన్యం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటుందని ఆయన స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. పాకిస్థాన్‌లో జరగాల్సిన రెండో విడత శాంతి చర్చలకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ హాజరు కావడం లేదని వైట్‌హౌస్ ప్రకటించింది. ఇరాన్ నుంచి ఒక స్పష్టమైన ప్రతిపాదన వచ్చి, చర్చలు ముగిసే వరకు కాల్పుల విరమణ కొనసాగుతుందని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన.. యూఎస్ ఉపాధ్యక్షుడి పాక్ పర్యటన వాయిదా

JD Vance Pakistan Trip Postponed Amid US Iran Talks Stalemate
  • పాకిస్థాన్‌లో జరగాల్సిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చల వాయిదా
  • ఇరాన్ నుంచి స్పష్టత రాకపోవడంతో అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన నిలిపివేత
  • పాకిస్థాన్ విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణను పొడిగించిన అధ్యక్షుడు ట్రంప్
  • అయితే హర్మూజ్ జలసంధిలో నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టీకరణ
  • దిగ్బంధనం ఎత్తివేస్తేనే చర్చలని తేల్చిచెప్పిన ఇరాన్

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల పునరుద్ధరణపై నెలకొన్న ఉత్కంఠకు ప్రస్తుతానికి తెరపడలేదు. పాకిస్థాన్‌లో జరగాల్సిన రెండో విడత చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం చేయాల్సిన పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. చర్చల్లో పాల్గొనడంపై ఇరాన్ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడమే ఇందుకు కారణమని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.

మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అభ్యర్థన మేరకు ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో వెల్లడించారు. ఇరాన్ ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చేవరకు ఈ సీజ్‌ఫైర్ కొనసాగుతుందని తెలిపారు.

 అయితే, కాల్పుల విరమణను పొడిగించినప్పటికీ, హర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే అంశం చర్చలకు ప్రధాన అడ్డంకిగా మారింది. నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు తాము చర్చలకు హాజరుకాబోమని ఇరాన్ తేల్చిచెప్పింది. అమెరికా చర్యల వల్ల వారి చిత్తశుద్ధిపై అనుమానాలు ఉన్నాయని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ పేర్కొన్నారు. దీంతో కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, ఇరు దేశాల మెట్టుదిగని వైఖరి వల్ల చర్చల ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడింది.

Related posts

పాక్‌లో దారుణం.. బొగ్గు గనిలో 20 మంది కార్మికులను చంపిన ఉగ్రవాదులు..!

Ram Narayana

అమెరికాలో జరిగిన రోడ్ ప్రమాదంలో ఖమ్మం జిల్లా విఎం బంజర వాసి మృతి…

Ram Narayana

తొలి గ్రామీ అవార్డుతో చరిత్ర సృష్టించిన దలైలామా!

Ram Narayana