తెలంగాణ వార్తలు

బరువైక్కిన హృదయాలతో మారబోయిన మధుసూదన్ కు వీడ్కోలు …

బరువైక్కిన హృదయాలతో మారబోయిన మధుసూదన్ కు వీడ్కోలు …

మంత్రి కోమటిరెడ్డి ,మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరుల నివాళులు 

ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించిన మంత్రి కోమటిరెడ్డి …కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ 

బోరున విలపించిన భార్య ,కుటుంబసభ్యులు

 బరువెక్కిన హృదయాలతో మారబోయిన మధుసూదన్ అంత్యక్రియలు వారిసొంత పట్టణమైన మిర్యాలగూడెం లో మంగళవారం  నిర్వహించారు ..సోమవారం కార్డియాక్ అరెస్ట్ తో హైద్రాబాద్ లోని  స్పెక్ట్రా ఆపాలో హాస్పటల్ లో  ఆకస్మిక మరణం చెందిన మధుకు మిర్యాలగూడెం లో పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు ..అందరికి సుపరిచుతుడిగా మంచి మిత్రుడిగా ఉన్న మధు ఈ విధంగా శవమై వస్తాడని ఊహించలేదని పలువురు మిత్రులు జర్నలిస్టులు , రాజకీయ నాయకులు కంటతడిపెట్టారు .. ఎంతో భవిష్యత్ ఉన్న మధు ఈ విధంగా తన తనువు అర్దాంతరంగా చాలిస్తాడని ఉహించలేకపోయామని ఆయనతో వారికున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు …

 మంత్రి కోమటిరెడ్డి 5 లక్షల ఆర్థిక సహాయం ..

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిపిఆర్ఓ మారబోయిన మధుసూదన్ అకాల మరణం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ లో మధుసూదన్ నివాసానికి చేరుకొని ఆయన భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మధుసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారిని ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సాయంగా ఆకుటుంబానికి తక్షణ సాయంగా 5 లక్షలు ఆ కుటుంబానికి అందజేశారు. ప్రభుత్వపరంగా మధుసూదన్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. మధుసూదన్ మృతి పట్ల జర్నలిస్ట్ రంగానికి వ్యక్తిగతంగా తమకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, బాలు నాయక్, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్ నెల్లికంటి సత్యం డిసిసి అధ్యక్షులు పూర్ణ కైలాస్, ఎడిషన్ ఇన్చార్జి కళ్యాణ్ నాగేశ్వరావు ,తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య, చెరుకు సుధాకర్, ఆర్టిఐ కమిషనర్ పిబి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు  అంతక్రియలో పాల్గొని పాడే మోశారు .. 

భౌతిక కాయానికి జర్నలిస్టుల నేతల నివాళులు ..

మిర్యాలగూడెంలోని  వారి నివాసంలో మధు భౌతిక కాయాన్ని జర్నలిస్టు యూనియన్ నేతలు ,పలువురు జర్నలిస్టులు సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు …ఈ సందర్భంగా కుటుంబసభ్యులను పరామర్శించించి ఓదార్చారు ..కార్యక్రమంలో టియుడబ్ల్యుజే రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె . రామనారాయణ, నల్లగొండ జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి,, జిల్లా కార్యదర్శి కలిమెల నాగయ్య, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు దోసపాటి శ్రీనివాస్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఏనుగు వెంకటేశ్వరరావు , నేషనల్ కౌన్సిల్ సభ్యులు నలజాల వెంకట్రావు  , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్ ,  ఎలక్ట్రానిక్ మీడియా ఖమ్మం జిల్లా అధ్యక్షులు మామిడాల భూపాల్ ,నల్లగొండ  ఆంధ్రజ్యోతి బ్యూరో సాంబశివారెడ్డి, ఖమ్మం నగర అధ్యక్ష కార్యదర్శులు చెరుకుపల్లి శ్రీనివాస్ , ఎన్.జనార్దనా చారి, 143 ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ , రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్ ,కళ్యాణ్ చక్రవర్తి ,  నివాళులు అర్పించిన వారిలో  ఉన్నారు . 

Related posts

కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు రేవంత్ ప్రభుత్వం నిర్ణయం

Ram Narayana

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ

Ram Narayana

లక్షడప్పులు ,వేల గొంతుకలు ప్రదర్శన వాయిదా… మంద కృష్ణమాదిగ

Ram Narayana