- మే 9న తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ
- పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మోదీ
- పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించనున్నారు. మే 9వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర పర్యటన ఖరారైంది. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. హైదరాబాద్ నగరంలోని పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక తెలంగాణకు రావడం ఇదే మొదటిసారి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన తెలంగాణకు వస్తారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఎంఎంటీఎస్ ఫేజ్-2ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్‌ను జాతికి అంకితం చేసే అవకాశముంది. రాష్ట్రంలో పలు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేసే అవకాశముంది. కాగా, మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా తెలియాల్సి ఉంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: