ఖమ్మం సుడా చైర్మన్ గా పువ్వాళ్ళ దుర్గాప్రసాద్
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మహమ్మద్ ఖాదర్ అలీ
ఖమ్మం జిల్లా స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్గా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ నియమించారు . ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రత్యేక జీవో ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. వైరాకు చెందిన దుర్గాప్రసాద్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మహమ్మద్ ఖాదర్ అలీ (ఖాదర్ బాబా) నియమితులైయ్యారు . కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా ఉన్న దుర్గాప్రసాద్ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల పాటు పార్టీ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. ఏడు సంవత్సరాల పాటు డిసిసి అధ్యక్షుడిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల రెండు నెలల క్రితం డిసిసి అధ్యక్షుల కొత్త కమిటీల నియామకాల నేపథ్యం తప్పనిసరి కావడంతో నూతి సత్యనారాయణ గౌడ్ నియమించబడ్డారు. దుర్గాప్రసాద్ నియామకం పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తన నియామకం పట్ల కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలకు, సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యున్నతి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుడిగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడిగా ఉన్న ఎండి ఖాదర్ అలీకి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి వరించింది …