తమిళనాడులో కొనసాగుతున్న అనిశ్చితి …నెంబర్ గేమ్ లో 2 సీట్లు దూరంలో విజయ్
ఆయనకు అధికారం దక్కకుండా అడ్డుకుంటున్న ద్రవిడ పార్టీలు
మద్దతుకు ముందుకు వచ్చిన వాళ్ళు సైతం వెనక్కు
వీసీకే , ఐయూఎం ఎల్ పార్టీలు దోబుచులాట ..
ఇస్తామంటూ ఒకసారి …లేదులేదు అంటూ మరోసారి ప్రకటనలు
తమిళనాడులో ఏపార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ పెట్టిన టీవీకే నిలవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతుంది ..శుక్రవారం రాత్రి పొద్దు పోయేవరకు గవర్నర్ నుంచి ప్రమాణస్వీకారానికి సంబందించిన ఎలాంటి ప్రకటన వెలువడలేదు .. నిన్నటివరకు కాంగ్రెస్ మాత్రమే టీవీకే మద్దతు ప్రకటించగా ,శుక్రవారం రోజున సిపిఐ ,సిపిఎం పార్టీలు కూడా తమ మద్దతు లేఖలను టీవీకే పార్టీకి ఇచ్చాయి ..అయినప్పటికీ టీవీకే 107 +కాంగ్రెస్ 5 + సిపిఐ 2 +సిపిఎం 2 = మొత్తం 116 మంది మద్దతు లభించింది …234 సభ్యులు ఉన్న తమిళనాడు అసెంబ్లీ లో ప్రభుత్వం ఏర్పాట్లు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ..కాగా వీసీకే పార్టీ 2 సీట్లు , ఐయూఎంఎల్ 2 మద్దతు ఇస్తామని ప్రకటించినట్లు ప్రచారం జరిగింది .అయితే తరువాత వారు ఇచ్చిన లెటర్ సరిగా లేదని లోకభవన్ వర్గాలు చెప్పడంతో శనివారం ఉదయం 11 గంటలకు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని అనుకున్న కార్యక్రమం రద్దు అయింది .. ఈ రెండు పార్టీల దోబుచులాట తమిళ రాజకీయాలను సంకటంగా మారుస్తున్నాయి. అయితే వారు అనుకున్నట్లు డీఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అంటే అదీలేదు .. మెజార్టీ సభ్యుల జాబితా తనకు ఇవ్వకుండా ప్రమాణ స్వీకారం చేయించనని గవర్నర్ తేల్చి చెప్పడంతో చేసేది లేక టీవీకే పార్టీ రేపు ప్రాణాస్వీకారం లేదని ఎవరు చెన్నై కి రావద్దని రాత్రి పొద్దు పోయిన తర్వాత ప్రకటించింది … గవర్నర్ తమ విశక్షణ అధికారాలను ఉపయోగించి శాసనసభను సుప్త చేతనావస్థలో ఉంచే అవకాశం ఉంది ..
క్షణక్షణం మారుతున్న రాజకీయాలు ..
తమిళనాట రాజకీయాలు క్షణక్షణానికి మారుతుండటంతో ,దేశం మొత్తం తమిళనాడులో ఏమి జరుగుతుందని చూస్తున్నాయి ..మొదట టీవీకే కి మద్దతు ఇచ్చిన పార్టీలు వెనక్కు తగ్గడం నిజంగా కొత్త రాజకీయాల్లోకి వచ్చిన సినీనటుడు విజయ్ కి చికాకు తెప్పించే అంశమే ..శనివారం సాయంత్రానికి 116 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా గట్టిన విజయ్ అధికారానికి మరో 2 సీట్ల దూరంలో ఉన్నారు ..డీఎంకే ,అన్నా డీఎంకే లు రెండు ఎట్టి పరిస్థితిలోను టివికెను అధికారంలోకి రానివ్వకూడని ఎత్తులు వేస్తున్నాయి…పైకి మాటలు ఎన్ని చెప్పిన లోపల వారికీ విజయ్ గద్దెనెక్కకూడదనే కమాన్ ఎజెండాతో ఉన్నాయి .. బీజేపీ కోరుకునేది కూడా అదే అయినందున సింగిల్ మెజార్టీ పార్టీని అధికారం ఏర్పాటుకు పిలవాల్సిన గవర్నర్ అందుకు ససేమీరా అంటున్నారు ..ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రానప్పుడు గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై అనేక ఉదాహరణలు ఉన్నాయి.. లోకసభలో సైతం మైనార్టీ ప్రభుత్వాలు ఏర్పడిన సంప్రదాయం ఉంది ..మరో పార్టీ డీఎండీకే నేత దినకరన్ గవర్నర్ కలిసి సీఎంగా అన్నాడీఎంకే నేత పళని స్వామికి అవకాశం ఇవ్వాలని కోరారు .. తమిళనాడు చర్యలను దేశం నిశితంగా గమనిస్తుంది …