Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆంధ్రకు సాధ్యం కాని ప్రత్యేక హోదా పుదుచ్చేరిలో ఎలా సాధ్యం…?

ఆంధ్రకు సాధ్యం కాని ప్రత్యేక హోదా పుదుచ్చేరిలో ఎలా సాధ్యం
-ప్రత్యేక హోదాపై టీడీపీ ఘాటు వ్యాఖ్యలు
-హోదా తెస్తానన్న వస్తాద్ -బీజేపీకి ఎలా సపోర్ట్ చేస్తున్నాడు
-స్పెషల్ స్టేటస్ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చిన బీజేపీ
పుదుచ్చేరిలో వైసీపీ నేతల ప్రచారం పై లోకేష్ షటైర్లు
ఏపీకి ప్రత్యేక హోదా అడిగే ధైర్యం జగన్ కు లేదని విమర్శలు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెబుతూనే, పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం పై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. ఆంధ్రాకు సాధ్యం కానిది పుదుచ్చేరిలో ఎలా సాధ్యం అవుతుందని .టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. ఫేక్ సీఎం ఏమి చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా ప్రజలు జగన్ రెడ్డి మాటలను తెలుసుకోవాలన్నారు. బీజేపీని హోదా గురించి అడిగే దైర్యం జగన్రెడ్డి కి లేదని తేలిపోయిందన్నారు. ఇది ఇలా ఉండగా బీజేపీ విధానాలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేక హోదా తెస్తామన్న వస్తాదు పుదుచ్చేరిలో బీజేపీకి ఎలా అనుకూలంగా ప్రచారం చేస్తారని జగన్ పై విమర్శలు దాడి మొదలైంది. వైసీపీ నేతలు పుదుచ్చేరిలో బీజేపీ కి అనుకూలంగా ప్రచారం చేయటాన్ని పలువురు తప్పుపడుతున్నారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మరో అడుగు ముందుకేసి జగన్ పై విమర్శలు వెక్కుపెట్టారు . “మరి మెడలు వంచే వస్తాద్ ఇలాంటి పరిస్థితుల్లో ఏంచేయాలి? రాష్ట్ర ప్రజలందరి తరఫున పోరాటం చేయాలి” అని పేర్కొన్నారు. కానీ, జగన్ అలా చేయకుండా…. అదే పుదుచ్చేరిలో ఎన్డీయేకి మద్దతుగా తన మంత్రులను, ఎంపీలను పంపించాడని అయ్యన్న మండిపడ్డారు.

మన హక్కుగా దక్కాల్సిన ప్రత్యేక హోదా అడిగే ధైర్యం లేకపోగా, పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామంటున్నఎన్డీయే తరఫున ప్రచారం చేస్తున్న ఈ వైసీపీ వాళ్లను ఏమనాలి? అంటూ నారా లోకేష్ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహులు అనేది వీళ్లకు చాలా చిన్న పదం అని విమర్శించారు. దీనిపై టీడీపీ నేతలు ప్రత్యేక హోదా పై బీజేపీ ని తప్పు పట్టడంతో పాటు పనిలో పనిగా జగన్ విధానాలపై ధ్వజమెత్తుతున్నారు.

Related posts

తిరుగుబాటు ఎమ్మెల్యేలది నమ్మక ద్రోహం …ఆదిత్య థాకరే !

Drukpadam

సంతనూతలపాడు పరిధిలో అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వొద్దు: పోలీసులను కోరిన వైసీపీ ఎమ్మెల్యే!

Drukpadam

పంట పొలాల్లో కాలవ గట్లను దూకుతూ సాగిన చంద్రబాబు… 

Drukpadam

Leave a Comment