జాతీయ వార్తలు

నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ కోసం నామ డిమాండ్

నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ ప్రకటించాలి

నేతన్నలపై జీఎస్టీ ఎత్తేయాలి

నేతన్నలకు కేసీఆర్, కేటీఆర్ కొండంత అండ

అఖిల భారత పద్మశాలి సంఘం హ్యాండ్లూమ్ విభాగ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు
చేనేత కార్మికులకు సంబంధించి నేషనల్ హ్యాండ్లూమ్ ఫాలసీ ప్రకటించాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం న్యూఢిల్లీలోని కానిస్ట్యూషన్ క్లబ్ లో అఖిల భారత పద్మశాలి సంఘం హ్యాడ్లూమ్ విభాగ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ నామ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. చేనేత కార్మిక కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని అన్నారు. చేనేతల అభివృద్ధి కి తెలంగాణా సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ ఎన్నో ప్రోత్సాహాకాలు ఇస్తూ ఆ రంగం అభివృద్ధి కి పెద్ద ఎత్తున నిధులు కేటీషిస్తూ కృషి చేస్తున్నారని అన్నారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరడం తో పాటు పోచంపల్లిలో మూతబడిన చేనేత పార్క్ ను తిరిగి ఏర్పాటు చేసేందుకు కేటీఆర్ కేంద్రానికి పలు లేఖలు రాసిన సంగతిని నామ గుర్తు చేశారు. తాను రైతు బిడ్డనని, చిన్నతనంలో తన తల్లిదండ్రులు చేనేత వస్త్రాలనే ధరించే వారని నామ అన్నారు.

Related posts

సింధు జలాల ఒప్పందం నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదం … కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

Ram Narayana

బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల భేటీకి సోనియా గాంధీ!

Drukpadam

11,000 లీటర్ల పాలతో అమ్మవారికి మహాభిషేకం..!

Ram Narayana