జాతీయ వార్తలు

మణిపూర్ హింస రాజ్య ప్రేరేపితమే…అనీరాజా….

మణిపూర్ హింస రాజ్య ప్రేరేపితమే
ఎన్ఎఫ్ఎస్ఐడబ్ల్యూ జాతీయ ప్రధాన కార్యదర్శి అనీరాజా

మణిపూర్ లో హింస జాతుల మధ్య, తెగల మధ్య జరిగింది కాదని రాజ్య హింస అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రేరేపితమే మణిపూర్ హింస అని ఎన్ఎస్ఐడబ్ల్యూ జాతీయ ప్రధాన కార్యదర్శి అనీరాజా తెలిపారు. మణిపూర్ ను చీల్చే కుట్రలో భాగంగానే హింస ప్రేరేపితమైందని ఆమె తెలిపారు. ప్రత్యామ్నాయ పౌర సమాజం ఆధ్వర్యంలో శనివారం ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో మణిపూర్ మారణకాండ , ఉమ్మడి పౌర స్మృతి అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రం భయానకంగా తయారైందని ఇందుకు కారణం ప్రభుత్వం చెబుతున్నట్లు జాతుల మధ్య వైరం కాదన్నారు. మే మూడు నుంచి ఆరు వరకు మణిపూర్లో హింస జరిగితే ఎన్ఎఫ్ఐడబ్ల్యూ బృందం జూన్ 28న మణిపూర్లో పర్యటించిందన్నారు. అనేక శిబిరాలను, ఆసుపత్రులను, హింస జరిగిన ప్రాంతాలను సందర్శించామని, అక్కడి అధికారులను కలిశామని ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించిన అవకాశం లభించ లేదన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మొట్టమొదటిగా వెళ్లిన మాకు అనేక విషయాలు అక్కడి స్థానికులు తెలియజేశారన్నారు. కుకీలకు చెందిన విద్యార్థులు కొండ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని విద్యా, వైద్య సౌకర్యాలను కల్పించాలని 15వేల మంది ఆందోళనను నిర్వహించారని, తమ నిరసనను తెలియజేశారని అనీరాజా తెలిపారు. వృత్తి నైపుణ్యాల అభివృద్ధితో పాటు ఇతర నిధులను 85 శాతం మైతేయి తెగలు నివసిస్తున్న ప్రాంతాలలో ఖర్చు చేయడాన్ని కుకీ విద్యార్థులు తప్పు పట్టారని ఆమె తెలిపారు. వారందరూ నిరసన అనంతరం చాందస్ఫూర్కు వెళ్తుండగా సంఘపరివార్ శక్తులుగా మాదిరిగా వ్యవహరించే అలంబై తెంగోలు, మైతేయి లూపిన్ అనే సంస్థలకు చెందిన బాధ్యులు విద్యార్థులపై దాడి చేశారన్నారు. అంతకు ముందే ఇంపాల్లోని చర్చిలను ధ్వంసం చేశారని హైకోర్టు తీర్పుపైన వారు ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారని అందుకే విద్యార్థులపై దాడి జరిగిందన్నారు. ఇది అనుకోకుండా జరిగింది కాదని విద్యార్థులపై దాడి జరిగిన కొన్ని సెకన్లలోనే ఇంపాల్తో పాటు కుకీలు నివసిస్తున్న అనేక ప్రాంతాలలో కాల్పులు, లూటీలు, దహనకాండ ప్రారంభమైందన్నారు. మే మూడు నుంచి ఆరవ తేదీ వరకు నిరంతరంగా దాడులు, మానభంగాలు, అమానవీయ ఘటనలు జరిగాయని ఈ నాలుగు రోజులు ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పోలీసుల నుంచి ఆయుధ దుకాణాల నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లి హత్యలు, దోపిడీలు చేస్తుంటే ప్రభుత్వం మౌనపాత్ర పోషించిందని అనిరాజా ఆరోపించారు. గోద్రా అల్లర్ల సమయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ కూడా ఇదే రీతిన వ్యవహరించారని కానీ అప్పటి ప్రధాని వాజ్ పేయ్ నువ్వు రాజధర్మాన్ని వదిలేశావని హెచ్చరించారని కానీ ఇప్పుడు బిజెపి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కూడా రాజధర్మాన్ని పాటించడం లేదన్నారు.

మణిపూర్లో శవాలు దుర్గంధం వెదజల్లుతున్నాయని అనేక మంది మృతుల బంధువులు కడపటి చూపుకు నోచుకోలేదని చివరి అంత్యక్రియలకు కూడా జరగలేదని ఆమె ఆరోపించారు. అమిత్ షా పర్యటన తర్వాతనే మణిపూర్ రాజ్య హింస ప్రారంభమైందన్నారు. కుకీ, నాగ, మైతేయి ఏరియాలుగా మణిపూర్ను విభజించి పాలించాలని చూస్తున్నారన్నారు. కుకీ ప్రాంతాన్ని అస్సాం రైఫిల్స్ కు అప్పగించారని మైతేయి ప్రాంతాలను వేరే వర్గాలకు అప్పగించారని ఇదంతా మణిపూర్ ప్రజలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. హిందుత్వ శక్తులు ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజాస్వామ్య మూలస్తంభాలను కూలదోయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. పార్లమెంటు కార్యనిర్వహక వర్గం, న్యాయశాఖ, సమాచార రంగాన్ని ధ్వంసం చేస్తున్నారని అనీరాజా ఆరోపించారు. నూతన చట్టాలను తీసుకు వచ్చి దేశ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని వారే చట్టాలు తీసుకు వచ్చి చివరకు ఆచట్టాన్నే తప్పుపట్టి శిక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని అనీరాజా తెలిపారు. దేశద్రోహులు పాలిస్తున్న ఈ సమయంలో
ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలి. కొన్ని కుటుంబాల కోసం బిజెపి పాలన సాగుతుందని, దీనిని అరికట్టేందుకు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. భవిష్యత్ భారతాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలని అనీరాజా పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావ్లో, మణిపూర్కు చెందిన సామాజిక వేత్త, అధ్యాపకురాలు కిమ్కోవా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది శేషగిరిరావు, ప్రముఖ వైద్యులు భారవి, డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్
ఐవి రమణారావు, పౌర సమాజం బాధ్యులు రవిమారుత్, క్రాంతి శ్రీనివాసరావు, భాస్కర్, విజయ్ పాల్గొన్నారు.

Related posts

ఇలా చేస్తే రూ.15కే లీటర్ పెట్రోల్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ…

Drukpadam

భారత జలాంతర్గామిని ఢీకొట్టిన చేపల వేట నౌక!

Ram Narayana

యమునా శుభ్రతపై రీల్.. కాలుజారి నదిలో పడ్డ బీజేపీ ఎమ్మెల్యే!

Ram Narayana