అంతర్జాతీయం

జీ-20 సదస్సు ప్రారంభం.. మొరాకో భూకంప విషాదంపై ప్రధాని మోదీ సంతాపం

  • గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తీకరణ
  • మొరాకోకు వీలైనంత సాయం చేస్తామని ప్రకటన
  • రెండు రోజుల పాటు కీలక అంశాలపై చర్చ

ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో జీ-20 సదస్సు ప్రారంభమైంది. ముందుగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘జీ-20 సదస్సు కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందు మొరాకోలో భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి నేను సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం. ఈ కష్టకాలంలో మొరాకోకు వీలైన ప్రతి సాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది’’ అని ప్రకటించారు. 

ఇక జీ-20 లో కొత్తగా ఆఫ్రికన్ యూనియన్ కూడా వచ్చి చేరింది. జీ20 దేశాల నేతలు అందరూ సదస్సు వేదిక వద్దకు చేరుకున్నారు. ఆదివారంతో ఈ సదస్సు ముగుస్తుంది. దీనికంటే ముందు అన్ని దేశాలతో కూడిన ఉమ్మడి డిక్లరేషన్ విడుదల కానుంది. సదస్సులో భాగంగా చర్చించి, ఏకాభిప్రాయం కుదిరిన అంశాలకు ప్రకటనలో చోటు లభిస్తుంది. ఈ సదస్సుతో జీ-20కి భారత్ నాయకత్వం ముగుస్తుంది. 2024 సంవత్సరానికి గాను బ్రెజిల్ జీ-20 అధ్యక్ష స్థానాన్ని అలంకరిస్తుంది. 2025లో దక్షిణాఫ్రికా ఈ బాధ్యతలు నిర్వహించనుంది.

Related posts

పిల్లల సామాజిక మాధ్యమం వాడకంపై ఫ్రాన్స్ కీలక నిర్ణయం దిశగా అడుగులు

Ram Narayana

పాకిస్థాన్ కీలక సంస్థలపై అమెరికా ఆంక్షలు…

Ram Narayana

శాంతి చర్చల్లో కీలక ముందడుగు.. పుతిన్, జెలెన్‌స్కీ మీటింగ్‌కు ట్రంప్ యత్నం!

Ram Narayana