Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ప్రయాణికుల్లా టికెట్లు కొనుక్కుని విమానాశ్రయంలోకి ఆందోళనకారుల ఎంట్రీ.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత.. 44 విమానాల రద్దు

  • తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ బంద్
  • విమానాశ్రయంలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • బంద్ కారణంగా విమాన టికెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులు

తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఐదు కన్నడ అనుకూల సంస్థలు చేపట్టిన బంద్ కర్ణాటకలో కొనసాగుతోంది. బంద్ సందర్భంగా బెంగళూరులో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించగా, ప్రైవేటు సంస్థలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ట్యాక్సీలు, ఆటోలు రోడ్డెక్కకపోవడంతో ప్రజా రవాణాకు ఆటంకం ఏర్పడింది. 

ఈ సందర్భంగా బెంగళూరు విమానాశ్రయంలోనూ గందరగోళం చెలరేగింది. ఎయిర్‌పోర్టులో నిరసన తెలిపేందుకు కర్ణాటక జెండాలతో వచ్చిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు వీరు టికెట్లు బుక్ చేసుకుని మరీ రావడం గమనార్హం. మరోవైపు, బెంగళూరు ఎయిర్‌పోర్టు అధికారులు 44 విమానాలను రద్దు చేశారు. బంద్ సందర్బంగా చాలామంది ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. విమానాలు రద్దయిన విషయాన్ని ప్రయాణికులకు చేరవేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఈ బంద్‌కు ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ మద్దతు తెలిపాయి.

Related posts

కర్ణాటకలో ఇద్దరు మహిళా ఐఏఎస్,ఐపీఎస్ అధికారుల మధ్య రచ్చ…

Drukpadam

 రూ.1,470కే విమాన టికెట్.. ఎయిరిండియా బంపరాఫర్

Ram Narayana

అమితాబ్ బచ్చన్‌కు 82 ఏళ్లు.. ఇప్పటికీ నటిస్తున్నారుగా!: అజిత్‌కు సుప్రియా సూలే కౌంటర్…

Drukpadam

Leave a Comment