అంతర్జాతీయం

కెనడాలో కూలిన శిక్షణ విమానం, ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్ల మృతి

  • బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో కూలిన విమానం
  • ముంబైకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మృతి
  • ప్రమాద ఘటనపై విచారణ జరుపుతోన్న సేఫ్టీ బోర్డు

కెనడాలో ఓ శిక్షణ విమానం కూలిన ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని చిల్లివాక్ సిటీ విమానాశ్రయానికి సమీపంలో ఈ శిక్షణ విమానం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇందులో ఇద్దరు భారతీయ ట్రెయినీ పైలట్లు ఉన్నారు. శిక్షణలో ఉన్న హైపర్ పీఏ-4 సెనెకా లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్ శనివారం హఠాత్తుగా పొదల్లోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ముంబైకి చెందిన అభయ్ గద్రూ, యశ్ విజయ్ మృతి చెందినట్లు మీడియాలో వచ్చింది. వీరిద్దరు ఒకే కుటుంబానికి చెందినవారుగా చెబుతున్నారు. ఈ ఘటనలో ఈ ముగ్గురు పైలట్లకు మినహా ఎవరికీ ఏమీ కాలేదు. విమానం కూలిన ఘటనపై కెనడా ట్రాన్సుపోర్టేషన్ సేఫ్టీ బోర్డు విచారణ జరుపుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Related posts

బెన్ స్టోక్స్‌కు తప్పిన పెను ప్రమాదం.. ముఖానికి తీవ్ర‌ గాయాలతో స్టార్ ఆల్‌రౌండర్!

Ram Narayana

మరిన్ని భీకర దాడులు చేస్తాం, ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు: ట్రంప్ హెచ్చరిక!

Ram Narayana

ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ తమ్ముడికి కీలక సలహా ఇచ్చిన నవాజ్ షరీఫ్!

Ram Narayana