- బీఆర్ఎస్‌కు 70, కాంగ్రెస్‌కు 34, బీజేపీకి 7 సీట్లు వస్తాయని వెల్లడించిన సర్వే
- కేసీఆర్ పనితీరుపై మిశ్రమ స్పందన
- హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ హవా
తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రానుందని, కానీ గతంలో వచ్చినట్లుగా 88 సీట్లు రాకపోవచ్చునని ఇండియా టీవీ సర్వే వెల్లడించింది. ఇండియా టీవీ సర్వే ఒపీనియన్ పోల్స్ ఫలితాల ప్రకారం బీఆర్ఎస్‌కు 70 సీట్లు, కాంగ్రెస్‌కు 34, బీజేపీకి 7 సీట్లు, మజ్లిస్ పార్టీకి 7 సీట్లు వస్తాయని తెలిపింది. 2018లో బీఆర్ఎస్‌కు 88 సీట్లు, కాంగ్రెస్‌కు 19 బీజేపీకి 1, మజ్లిస్‌కు 7 సీట్లు వచ్చాయి. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని వెల్లడించింది.
ఈ సర్వే ప్రకారం కేసీఆర్ పనితీరు చాలా బాగుందని 45 శాతం మంది, పర్వాలేదు అని 15 శాతం మంది, ఏమీ బాగాలేదని 40 శాతం మంది అభిప్రాయపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ 13 సీట్లు గెలవవచ్చునని ఈ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ 5, బీజేపీ 3 స్థానాల్లో గెలవవచ్చునని పేర్కొంది.