అంతర్జాతీయం

హైదరాబాద్-మాల్దీవ్స్ మధ్య నేరుగా విమానాలు.. అందుబాటులోకి తెచ్చిన ఇండిగో

  • మంగళ, గురు, శనివారాల్లో మాలెకు డైరెక్ట్ ఫ్లైట్స్
  • పునఃప్రారంభించిన ఇండిగో
  • ఉదయం 10.20 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరనున్న విమానం

మాల్దీవ్స్‌లో విహరించాలనుకునే ప్రయాణికులకు చౌకధరల విమానయాన సంస్థ ఇండిగో బ్రహ్మాండమైన కబురు చెప్పింది. హైదరాబాద్ నుంచి మాలేకు నిన్నటి నుంచి డైరెక్ట్ సర్వీసులను మళ్లీ ప్రారంభించింది. మంగళ, గురు, శనివారాల్లో హైదరాబాద్-మాలె విమానం అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. 

ఈ మూడు రోజుల్లో శంషాబాద్ విమానాశ్రయంలో ఉదయం 10.20 గంటలకు విమానం బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు మాలె చేరుకుంటుంది. గంట తర్వాత అంటే 1.25 గంటలు తిరిగి అక్కడ బయలుదేరి సాయంత్రం 4.25 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

Related posts

ట్రంప్ టారిఫ్స్‌.. తీవ్రంగా ప్రభావితమ‌య్యే రంగాలివే..!

Ram Narayana

యుద్ధం ఎఫెక్ట్.. శ్రీలంకలో భారీగా పెరిగిన పెట్రోల్ ధర…

Ram Narayana

దక్షిణాఫ్రికా బంగారు గనిలో ఆకలితో అలమటించి 100 మంది మృతి

Ram Narayana