తెలంగాణ రాజకీయ వార్తలు ..

2019 పార్లమెంట్ ఎన్నికల్లో తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణం …కవిత సంచలనం ఆరోపణలు

  • కేసీఆర్ నిజామాబాద్ కు వచ్చినప్పుడు కార్యకర్తలను స్థానిక నేతలు కలవనీయలేదన్న కవిత
  • 2019లో నేను ఓడిపోవడానికి బీఆర్ఎస్ నేతల వైఖరే కారణం
  • తాను పర్యటించినప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని వ్యాఖ్య
  • తనను ఎరైనా కలవొచ్చన్న కవిత

కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తన ఓటమికి సొంతపార్టీ ప్రజాప్రతినిధులే కారణమని సంచలన ఆరోపణలు చేశారు …ఆ ఎన్నికల్లో ఆమె నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీ గా పోటీచేసి ఓడిపోయారు …అయితే ఆమె ఎప్పుడు ఈ విషయాలు చెప్పకుండా ఇప్పుడు చెప్పడంలో ఆంతర్యం ఏమిటనే అంశం చర్చనీయాంశంగా మారింది …తిరిగి ఆమె నిజామాబాద్ ఎంపీ సీటు పై ఫోకస్ పెట్టారు …దీంతో అక్కడే ఆమె ఎక్కువగా తిరుగుతున్నారు …అప్పట్లో కార్యకర్తలు సీఎం కేసీఆర్ ను కలవాలంటే ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారని ఆరోపించారు …తనను కూడా కలవనిచ్చేవారు కాదని అన్నారు …ఇప్పుడు తాను నిజామాబాద్ లో మకాం వేసి ఉంటానని ఎవరైనా కలవచ్చునని ఆమె అన్నారు …

పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అన్ని ప్రధాన ప్రధాన పార్టీలు ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. సమీక్షలను నిర్వహిస్తూ గత పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి కవిత గెలుపొందారు. అయితే, 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓటమిపాలయ్యారు. మరోవైపు ఆ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకరించిందంటూ బీఆర్ఎస్ నేతలు అప్పట్లో విమర్శించారు. 

తాజాగా, నిజామాబాద్ బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో కవిత మాట్లాడుతూ… 2019లో తాను ఓటమిపాలు కావడానికి సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల వైఖరే కారణమని ఆమె అన్నారు. ఆ సమయంలో నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటించిన సమయంలో ఆయనను కార్యకర్తలు కలవకుండా స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డంకులు సృష్టించారని చెప్పారు. తాను జిల్లాలో పర్యటించినప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ విషయమై తనకు ఫిర్యాదులు కూడా అందాయని చెప్పారు. తాను నిజామాబాద్ లోనే ఉంటానని… ఎవరైనా తనను కలవొచ్చని అన్నారు. అందరూ కూడా పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని సూచించారు.

Related posts

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం: అధికారులకు కేటీఆర్ హెచ్చరిక!

Ram Narayana

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి ,అద్దంకి , శంకర్ నాయక్

Ram Narayana

ఉత్కంఠకు తెర… వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్…

Ram Narayana