- ఈ ఉదయం పవన్ తో కలిసి భోగిమంటలు కార్యక్రమంలో పాల్గొన్న బాబు
- అనంతరం లోకేశ్ తో కలిసి స్వగ్రామం పయనం
- నారావారిపల్లెలో గ్రామదేవతకు పూజలు చేయనున్న టీడీపీ అధినేత
సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమ స్వగ్రామం నారావారిపల్లె చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ లకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఇంతకుముందే నారావారిపల్లె చేరుకున్నారు. చంద్రబాబు, లోకేశ్ నిన్న ఉండవల్లిలో పవన్ కల్యాణ్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ ఉదయం చంద్రబాబు, పవన్ భోగిమంటలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం చంద్రబాబు, లోకేశ్ స్వగ్రామానికి బయల్దేరారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి వారు రోడ్డు మార్గంలో నారావారిపల్లె చేరుకున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్నారు. గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేయనున్నారు.





Save or share this story as a newspaper-style Epaper Clip: