బెంగాల్ మాజీ సీఎం కామ్రేడ్ బుద్దదేవ్ భట్టాచార్య కన్నుమూత
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 80 ఏళ్లు. ఆయన 11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా చేశారు. 2000 నుంచి 2011 వరకు ఆయన బెంగాల్ సిపిఎం పార్టీ తరఫున,సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. తండ్రి బుద్దదేవ్ మరణించినట్లు కుమారుడు సుచేతన్ భట్టాచార్య ప్రకటించారు.బెంగాల్‌కు ఆరవ సీఎంగా చేశారాయన. బెంగాల్‌లో సుమారు 34 ఏళ్లు వామపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ఏలాయి. సీఎంగా బుద్దదేవ్ విధులు చేపట్టారు. కోల్‌కతాలోని పామ్ అవెన్యూలో ఇవాళ ఉదయం 8.30 నిమిషాలకు ప్రాణాలు విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన మృతి సిపిఎం పార్టీకి, వాపక్ష ఉద్యమానికి, తీరనిలోటు, వీరి మృతి బాధాకరం, ఆదర్శవంతంగా జీవించారని, బెంగాలకి, నిస్వార్థ సేవ చేశారన్నారు. సంతాపాన్ని సానుభూతి ని తెలియజేస్తూ విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్ కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య,