జాతీయ వార్తలు

హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు!

  • కాల్పుల్లో ఎమ్మెల్యే అనుచరుడికి గాయాలు
  • ముఠా తగాదాలుగా భావిస్తున్న పోలీసులు
  • కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు

హర్యానాలోని పంచకులలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. ఈ దాడి ఘటనలో ఎమ్మెల్యే అనుచరుడికి గాయాలయ్యాయి. అతనికి రెండు చోట్ల బుల్లెట్ గాయాలు అయ్యాయి. సదరు అనుచరుడికి నేర కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కాల్పుల వెనుక ముఠా తాగాదాలు ఉండవచ్చునని ప్రాథమికంగా భావిస్తున్నారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. 

అక్టోబర్ నెలలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ కాల్పులు జరిపారు. కాల్పుల విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బుల్లెట్ గాయాలైన అనుచరుడిని చికిత్స నిమిత్తం చండీగఢ్‌లోని పీజీఐ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Related posts

గల్వాన్ ఘర్షణల తర్వాతే చైనా అణుపరీక్ష.. అమెరికా సంచలన ఆరోపణ…

Ram Narayana

ప్రధాని మోడీ రిటైర్మెంట్ ఊహాగానాలకు తెరదించిన ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగత్

Ram Narayana

రాజస్థాన్‌లో బయటపడ్డ 201 మిలియన్ ఏళ్లనాటి జీవి అస్థిపంజరం!

Ram Narayana