ఈ చిప్ తో కొన్ని నిమిషాల్లోనే గుండెపోటు ముప్పును పసిగట్టవచ్చు!
- జాన్ హాప్కిన్స్ వర్సిటీ పరిశోధకుల వినూత్న సృష్టి
- నానో టెక్నాలజీ సాయంతో సరికొత్త రక్తపరీక్ష
- 5 నుంచి 7 నిమిషాల్లోనే ఫలితం వెల్లడి
శాస్త్రవేత్తలు కొత్త తరహా రక్తపరీక్షను అభివృద్ధి చేశారు. ఒక చిన్న చిప్ సాయంతో నిర్వహించే ఈ రక్తపరీక్షతో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కొన్ని నిమిషాల్లోనే పసిగట్టవచ్చట.
ఈ చిప్ ఆధారిత రక్తపరీక్షను అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. 5 నుంచి 7 నిమిషాల వ్యవధిలోనే ఈ బ్లడ్ టెస్టు పూర్తవుతుంది. ఇతర టెస్టులకు గంటల కొద్దీ సమయం పడుతుండగా, ఈ టెస్టుతో నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ బ్లడ్ టెస్టు కోసం హాప్కిన్స్ వర్సిటీకి చెందిన సహాయ పరిశోధక శాస్త్రవేత్త పెంగ్ ఝెంగ్, ఆయన బృందం ఒక చిన్న చిప్ ను రూపొందించింది. ఇందులో నానో టెక్నాలజీ వినియోగించారు.