అంతర్జాతీయంప్రమాదాలు ...

వివాహ వేడుక నుంచి వస్తున్న ట్రక్కు నదిలో పడి 71 మంది జలసమాధి…

  • ఇథియోపియాలోని సిదమా జిల్లాలో నిన్న సాయంత్రం ఘటన
  • మృతుల్లో 68 మంది పురుషులే
  • గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమం

దక్షిణ ఇథియోపియాలో నిన్న సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఓ వివాహానికి హాజరైన బృందం తిరిగి స్వస్థలానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 71 మంది జల సమాధి అయ్యారు. సిదమా రాష్ట్రంలోని గెలాన్ వంతెనపై నుంచి ప్రయాణిస్తున్న సమయంలో ట్రక్కు ఒక్కసారిగా అదుపుతప్పి నదిలో పడిపోయింది.

నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం, సహాయక చర్యలు అందడంలో ఆలస్యం కారణంగా మృతుల సంఖ్య పెరిగినట్టు చెబుతున్నారు. మృతుల్లో 68 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Related posts

భారత ఎకానమీపై ట్రంప్ వ్యాఖ్యలు.. ఆస్ట్రేలియా మంత్రి కీలక వ్యాఖ్యలు!

Ram Narayana

అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్.. స్తంభించిన కార్యకలాపాలు!

Ram Narayana

ఉక్రెయిన్‌కు ట్రంప్ షాక్.. మిలటరీ సాయం నిలిపివేత!

Ram Narayana