ఖమ్మం వార్తలు

మంత్రుల ,ప్రజాప్రతినిధుల నూతన సంవత్సర శుభాకాంక్షలు …

ప్రియమైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు,

ఈ నుతన సంవత్సరం ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు , సుఖశాంతులతో కూడిన జీవితం అందాలని కోరుకుంటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి కి నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ నూతన సంవత్సర ప్రారంభం మన సమాజం లో కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు మరియు కొత్త విజయం కోసం మరింత కృషి చేయడానికి మనకు ఉత్సాహం కలిగిస్తుంది.

మీతో ఎన్నుకోబడిన ఈ ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు కు అనుగుణంగా ఈ నూతన సంవత్సరంలో కుడా ముందుకు సాగుతుంది అని తెలియజేస్తు మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మీ
భట్టి విక్రమార్క మల్లు
ఉప ముఖ్యమంత్రి వర్యులు
తెలంగాణ రాష్ట్రం.

==================================

తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు ..
రైతులు సుఖ సంతోషాలతో పాడి పంటలతో చల్లగా ఉండాలి
ఆయిల్ పామ్ రైతులకు టన్ను పామాయిల్ గెలలు ధర 20,506 రూపాయలుగా స్థిరీకరించబడింది .
నూతన సంవత్సర కానుకగా జనవరి మొదటి తారీఖు నుంచి పెరిగిన ధరలు అమలు
దేశంలో ఎక్కడా లేని విధంగా రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో రుణమాఫీ తో రైతు రాజ్యం
రుణమాఫీ …రైతు భరోసా రైతు భీమా…సన్న ధాన్యంకు 500 బోనస్ తో తెలంగాణ రైతాంగంకు మంచి రోజులు
అత్యధిక ధాన్యం ఉత్పత్తితో యావత్ దేశానికి తెలంగాణ అన్నపూర్ణ గా నిలిచింది.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు పొలం బాట పట్టేలా తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికే మార్గదర్శిగా మారబోతోంది.

మీ తుమ్మల

===========================

రేపు ఉదయం 11:00 గంటలకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారు క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు..
ముఖ్య గమనిక:- మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి
సంతాప దినాల సందర్భంగా రేపు ఎటువంటి శాలువాలు,బొకేలు,కేకు,గిఫ్ట్లు స్వీకరించడవు..

ఇట్లు
తుమ్మల గారి క్యాంపు కార్యాలయం (ఖమ్మం)

============================================

కొత్త ఉత్సాహం కొనసాగాలి

  • తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త ఏడాది… కొత్త ఆశలు…. కొత్త కోరికలు…. కొత్త లక్ష్యాలు…. కొత్త ఆశయాలు…. కొత్త నిర్ణయాలు…. కొత్త ఉత్సాహంతో కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు 2025 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటింటా ఆనందాలు…. ప్రతీ కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

మీ శీనన్న …

===============================================================================

కొత్త..
ఆశలు చిగురించాలి..
నూతన..
ఆశయాలు నెరవేరాలి..
నవ..
సంకల్పం సిద్ధించాలి..

గడిచిన కాలం నుంచి..
మంచి అనేది..
జ్ఞాపకాల దొంతరలో పదిలం చేద్దాం.

ఇక.. రాబోయే కొత్త ఏడాదిని మనసారా ఆహ్వానిద్దాం.

తెలంగాణ రాష్ట్ర , ప్రత్యేకించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఉభయ జిల్లాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మీ..రామసహాయం రఘురాం రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు

=====================================================
నూతన సంవంత్సరా శుభాకాంక్షలు …

2024 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2025 సంవత్సరానికి అడుగిడుతున్న వేళ రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు …రానున్న కాలంలో ప్రజలు తమ హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉంది …పాలకులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం మరింత వత్తిడి తెచ్చేందుకు పూనుకోవాలి …పీడిత ,తాడిత ఉద్యమాలకు సిపిఐ పార్టీ ఎప్పుడు బాసటగా ఉంటుందని తెలియజేస్తున్నాను …

మీ కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే కొత్తగూడెం

========================================================

ప్రశాంత వాతావరణంలో కుటుంబంతో న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలి ఎమ్మెల్యే జారె

నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా నూతన (ఆంగ్ల) సంవత్సర శుభాకాంక్షలు
ఈ కొత్త సంవత్సరంలో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలి
రాబోయే కొత్త సంవత్సరంలో మీరు వేసే ప్రతి అడుగు చేసే ప్రతి పనిలో విజయం సాదించాలి
ముఖ్యంగా నూతనసంవత్సర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలి

మీ జారే ఆదినారాయణ అశ్వారావుపేట ఎమ్మెల్యే

====================================================================

ప్రియమైన తెలంగాణ రాష్ట్ర ప్రజలారా,

ముందుగా, ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ ఆనందం, శాంతి, ఆరోగ్యం మరియు సత్ఫలితాలు కలగాలని నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు.

నూతన సంవత్సర ప్రారంభం మన సమాజం లో కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు మరియు కొత్త విజయం కోసం మరింత కృషి చేయడానికి మనకు ఉత్సాహం కలిగిస్తుంది.

ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికీ బాగోగులు, సమృద్ధి, మరియు శ్రేయస్సు అందాలని కోరుకుంటున్నాను.
మనం సంస్కారాలు, విలువలు మరియు ఆత్మగౌరవాన్ని ఉంచుకుని సుదీర్ఘ మార్గాన్ని నిర్మించుకుందాం. ప్రతి దారిలో మనం సుఖం, శాంతి మరియు విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మీ
నందిని భట్టి విక్రమార్క మల్లు
అమ్మ ఫౌండేషన్ చైర్మన్

Related posts

పట్టాభిషిక్తుడైన కళ్యాణ రాముడు

Ram Narayana

కలెక్టరేట్ లో ఫోటో ఎగ్జిబిషన్, స్టాల్స్ ను తిలకించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

Ram Narayana

సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ హఠాన్మరణం …

Ram Narayana