ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

నరసరావుపేటలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని బెదిరించి రూ.11 లక్షలు వసూలు…

  • ఆన్ లైన్ లో గంజాయి కొన్నట్టు ఆధారాలు ఉన్నాయంటూ ఫోన్ కాల్
  • అరెస్ట్ చేసేందుకు స్పెషల్ పోలీసులు వస్తున్నారని బెదిరింపులు
  • భయపడి వారు కోరిన డబ్బు చెల్లించిన యువతి
  • కేసు నమోదు చేసుకున్న నరసరావుపేట పోలీసులు

ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడడంలేదు. తాజాగా, పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓసాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని బెదిరించిన కేటుగాళ్లు రూ.11 లక్షలు వసూలు చేశారు. ఆన్‌లైన్ లో గంజాయి కొన్నట్టుగా ఆధారాలు ఉన్నాయని మోసగాళ్లు ఆ ఐటీ ఉద్యోగినికి ఫోన్ చేశారు. అరెస్ట్ చేసేందుకు స్పెషల్ పోలీసులు వస్తున్నారంటూ ఆ యువతికి ఫోన్ కాల్స్ చేశారు. 

దాంతో భయపడిపోయిన ఆ ఉద్యోగిని ఆన్‌లైన్‌లో వారడిగిన డబ్బు చెల్లించింది. అనంతరం, ఈ వ్యవహారంపై ఆమె నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

వివేకా హత్య కేసులో కీలక ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు…

Ram Narayana

హైద్రాబాద్ లో దారుణం …తోటి టెక్కీపై గ్యాంగ్ రేప్!

Ram Narayana

ఎన్సీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించిన శరద్ పవార్

Drukpadam