తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పంచాయతీ ఢిల్లీకి!
పీసీసీ చీఫ్ మాటలు భేఖాతర్ చేస్తూ బహిరంగ ప్రకటనలు చేసిన ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేల తీరుపై అందిస్తాం సీరియస్
తాను 5 వ తేదీ హైద్రాబాద్ వస్తానని చెప్పిన ఇంచార్జి దీపదాస్ మున్షి
మరోసారి మీడియా ముందుకు వచ్చిన కొందరు ఎమ్మెల్యేలు
తెలంగాణలో అధికర్మలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొందరు ఎమ్మెల్యేల తీరు తలనొప్పిగా మారింది …గతం మూడు రోజుల క్రితం జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వరంలో 7 గురు ఎమ్మెల్యేలు గచ్చిబౌలిలో గల హోటల్ కోహినూర్ లో రహస్యంగా సమావేశమైయ్యారు …అందులో ఎమ్మెల్యేలపట్ల కొందరు మంత్రులు వ్యవహరిస్తున్న తీరు ,ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు అనుకున్న స్థాయిలో లేకపోవడంపై చర్చించుకున్నారు …ఎమ్మెల్యేలపట్ల కొందరు మంత్రుల తీరు అవమానకరంగా ఉందని అందువల్ల ఈ విషయాలను సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకోని పోవాలని నిర్ణయించు కున్నారు …పార్టీ లేదా సీఎం దృష్టికి తీసుకొని రావాల్సిన ఎమ్మెల్యేలు పార్టీకి సీఎం కు కనీస సమాచారం లేకుండా సమావేశం కావడంపై అధిష్టానం గుర్రుగా ఉంది ..తమకు ఉన్న సమస్యలు సీఎం లేదా పీసీసీ దృష్టికి తీసుకోని వెళ్లి పరిష్కరించుకోవాల్సింది పోయి ఇలా బజారుకు వెక్కడం ఏమిటని పార్టీ పెద్దలు అంటున్నారు …ఎమ్మెల్యేల రహస్య సమావేశంపై బయటకు రావడంతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి , అటు అధిష్టానం రంగంలోకి దిగింది …పీసీసీ చీఫ్ ద్వారా ఎమ్మెల్యేలకు ఫోన్స్ చేసి ఎవరు పార్టీకి మంత్రులు వ్యతిరేకంగా బహిరంగంగా మళ్లాడవద్దని చెప్పించారు …అయినప్పటికీ వారిలో మార్పు రాలేదు …అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ తాము సమావేశం అయినమాట నిజమేనని అంగీకరించారు …అయితే తాము రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉన్నామని తెలిపారు ..దీంతో పార్టీ అధిష్టానం మాటలను ఎమ్మెల్యేలు భేఖాతర్ చేసారని పార్టీ గుర్రుగా ఉంది …రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపదాస్ మున్షి ఈనెల ఐదువా తేదీన వచ్చి అన్ని వివరాలు పరిశీలిస్తామని చెప్పినప్పటికీ వారి వైఖరిలో మార్పు రాకపోవడంతో ఆమె వారిని ఢిల్లీకి పిలిచినట్లు సమాచారం …తమ మనసులో ఉన్న అభిప్రాయాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు …చూద్దాం ఏమి జరుగుతుందో …!