ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణం…హాజరైన ప్రధాని మోడీ
కేంద్రమంత్రులు , వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీ నేతలు
ఈ ప్రమాణస్వీకారానికి హాజరైన చంద్రబాబు, పవన్
వారిద్దరిని అప్యాయంగా పలకరించిన ప్రధాని మోదీ
ఆమె చేత ప్రమాణం చేయించిన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా
మంత్రులుగా పర్వేశ్ శర్మ, సాహిబ్ సింగ్, అశీశ్ సూద్, మంజీందర్ సింగ్ తదితరులు ప్రమాణం
హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. ఆమె చేత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. అలాగే మంత్రులుగా పర్వేశ్ శర్మ, సాహిబ్ సింగ్, అశీశ్ సూద్, మంజీందర్ సింగ్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ఈ ప్రమాణస్వీకారానికి హాజరైన చంద్రబాబు, పవన్ ను అప్యాయంగా పలకరించిన మోదీ
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. ఆమె చేత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. ఆమెతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఏపీ నుంచి సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.


ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ ను ప్రధాని మోదీ అప్యాయంగా పలకరించారు. ప్రత్యేకంగా పవన్ గురించి మాట్లాడుతూ నవ్వులు పూయించారు. కాగా, ఇటీవల వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ బంపర్ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. అటు ఆప్ కేవలం 22 సీట్లకే పరిమితమైంది. దీంతో దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ జెండా పాతింది.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరైన విషయం తెలిసిందే. ఇదే కార్యక్రమానికి ఏపీ నుంచి సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.
అయితే, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేదిక మీదున్న ఎన్‌డీఏ నేతలకు అభివందనం చేస్తూ ముందుకెళ్తున్న ప్రధాని మోదీ పవన్ ను చూసి ఆగిపోయారు. ఆయనతో కరచాలనం చేయడంతో పాటు కొద్దిసేపు ముచ్చటించారు.
ఆ సమయంలో జనసేనానితో ఏదో మాట్లాడుతూ మోదీ నవ్వులు పూయించారు. ప్రధాని మాటలకు పవన్ తో పాటు పక్కన ఉన్న నేతలు కూడా పగలబడి నవ్వడం కనిపించింది. ఆ తర్వాత సీఎం చంద్రబాబుకు కూడా మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. పవన్, మోదీ నవ్వులు పూయించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.